Liz Truss's final speech as British Prime Minister
Liz Truss: బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన 45 రోజులకే రాజీనామా ప్రకటించిన లిజ్ ట్రస్.. మంగళవారం ప్రధానిగా తన చివరి ప్రసంగం చేశారు. ముందుగా బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌కు ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్ మళ్లీ పైకి లేస్తుందని, బ్రిటన్ పౌరులపై తనకు ఆ నమ్మకం ఉందని అన్నారు. వాస్తవానికి ఈ సమస్యను ఎదుర్కోలేకనే ఆమె రాజీనామా చేశారు.
‘‘బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రిషి సునాక్‌కి ఆల్ ది బెస్ట్. అయితే బ్రిటన్ చాలా కష్టకాలంలో ఉంది. దాన్ని నుంచి దేశాన్ని బయటపడేయడానికి సత్వర చర్యలు అవసరం. దాన్నుంచి బ్రిటన్ బయట పడుతుంది, బ్రిన్ పౌరులపై నాకు ఆ నమ్మకం ఉంది. బ్రిటన్ రాణికి జాతి అంతిమ వీడ్కోలు పలికిన సమయంలో నేను ప్రధానిగా ఉండడం గౌరవంగా ఉంది’’ అని అన్నారు.
ఇక ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఆమె స్పందిస్తూ ‘‘పుతిన్‌పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతోంది. అందరూ ఉక్రెయిన్‌కు మద్దతునీయాలి. అంతేకాదు బ్రెగ్జిట్ వల్ల సొంతంగా ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందాలి’’ అని అన్నారు. ప్రధానిగా చివరి ప్రసంగం చేశాక కింగ్ చార్లెస్ IIIను కలిసేందుకు లిజ్ ట్రస్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు.
బ్రిటన్ ప్రధానిగా భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న తరువాత బ్రిటన్ మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. వెస్ట్‌మిన్‌స్టర్‌లోని అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో ఒకరిగా పేరుగాంచిన 42ఏళ్ల సునాక్ ఆధునిక కాలంలో దేశంలోని అతి పిన్న వయస్కుడైన నాయకుడిగా మారారు. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో రిషి సునాక్ మూడవ ప్రధాని కావటం విశేషం.