కరోనా భయం : స్థానిక, మేయర్ ఎన్నికల వాయిదా

  • Publish Date - March 14, 2020 / 01:34 PM IST

కరోనా భయం అన్ని దేశాలను పట్టి పీడిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖ వ్యక్తుల వరకు గజగజ వణుకుతున్నారు. దీంతో ఆయా దేశాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇతర దేశాలకు విమానాలను, వీసాలు నిలిపివేస్తున్నాయి. ప్రజలకు సూచనలు, సలహాలు అందచేస్తున్నాయి. బ్రిటన్ దేశాన్ని కూడా..ఈ వైరస్ భయకంపితులను చేస్తోంది. మొత్తం ఇక్కడ 798 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వీరందరికీ ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. 

కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక, మేయర్ ఎన్నికలను వాయిదా వేయాలని డిసైడ్ అయ్యింది. 2020, మే 07వ తేదీ ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఇంగ్లండ్ ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు నిర్వహించినా..కరోనా ఎఫెక్ట్‌తో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఇంట్రస్ట్ చూపించరని ఎలక్టోరల్ కమిషన్ భావించింది.

Read More : GST కౌన్సిల్ సమావేశం : పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు

స్థానిక ఎన్నికలను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికలను సంవత్సరం వరకు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సదీఖ్ ఖాన్ (మేయర్) వెల్లడించారు. లండన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రయత్నిస్తానని, ప్రభుత్వం, నిపుణులతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.