Lottery Winner
Lottery Winner : అమెరికాలో 77 ఏళ్ల వ్యక్తిలా లాటరీ తగిలింది. అతని సంతోషానికి అవధుల్లేవు. సాధారణంగా లాటరీ తగిలి అందిన డబ్బులతో మీరేం చేస్తారని ఎవరన్నా అడిగితే..ఇల్లు కొంటామనో..లేదా స్థలం కొంటామనో ఇంకా టూర్ వెళతామనో చెబుతారు. కానీ ఈ పెద్దాయన మాత్రం లాటరీ డబ్బులతో మొట్టమొదటిగా తన భార్యకు ఏం కొన్నాడో తెలుసా..?తెలిస్తే హ్యాట్సాఫ్ అంటాం. ఈ వయస్సులో కూడా భార్య అంటే ఎంత ప్రేమో అంటూ ముచ్చటపడతాం.
అమెరికాలోని కొలరాడోలో 77 ఏళ్ల బడ్ అనే పెద్దాయనకు ఐదు మిలియన్ల లాటరీ తగిలింది. సెప్టెంబర్ 6,(2023)న లాటరీ 5 లక్షల 67 వేల 041 డాలర్లు లాటరీ తగిలిందని సమాచారం అందింది. అంటే భారత్ కరెన్సీలో రూ.41 కోట్లు పైనే. మిస్టర్ బడ్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు బైక్ రైండింగ్ అంటే ఇష్టం. అలాగే టెన్నిస్ అంటే కూడా చాలా ఇష్టం. బడ్ తన భార్యతో కలిసి ఆరు నెలలు కొలరాడోలోను..మరో ఆరు నెలలు అరిజోనాలో ఉంటుంటారు. ఇద్దరు నిరాడంబరమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు.
డబ్ కు కొలరాడో అంటే చాలా ఇష్టం. “కొలరాడో ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశం,”అంటారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 6న అతనికి లాటరీ తగిలింది. బడ్ కు తన లక్కీ నంబర్లపై ఉండే లాటరీ టికెట్ కొనటం అలవాటు. అలా అతను మాంట్రోస్‌లోని హాంగిన్ ట్రీ ట్రావెల్ ప్లాజాలో కొన్న ఓ టికెట్ కు రూ.41 కోట్ల తగిలింది. దీంతో బడ్ ఆనందపడ్డాడు. ఆ డబ్బులతో తొలిసారి ఓ అనుభూతినిచ్చేది కొనాలనుకున్నాడు. అలా తన భార్య కోసం పువ్వులు, ఓ పుచ్చకాయ కొన్నాడు.
బడ్ భార్యకు ఇటీవల ఆరోగ్యం బాగాలేదని..కొన్ని ఆపరేషన్లు చేయించాల్సి ఉంది. అందుకే ఆమె సర్జరీల తరువాత త్వరగా కోలుకోవాలని ఆశిస్తు పుచ్చకాయ, పువ్వులు కొన్నానని తెలిపాడు. అలాగే లాటరీ డబ్బుల్లో కొంత స్వచ్ఛంధ సంస్థలకు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నానని తెలిపాడు బడ్.