90 years Old Sisters : ఈ అక్కాచెల్లెళ్ల కలుసుకోవడం ఇదే చివరిసారి కావొచ్చు..అయినా ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో

అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకం. పెళ్లిళ్లై దూరంగా ఉన్నా వారి మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. 90 లలో కూడా దూరాన ఉన్న చెల్లిని చూడటానికి ఓ వృద్ధురాలు చేసిన ప్రయాణం గురించి తెలిస్తే కన్నీరొస్తుంది. వారిద్దరినీ చూస్తే చూడ ముచ్చటేస్తుంది.

90 years Old Sisters : ఈ అక్కాచెల్లెళ్ల కలుసుకోవడం ఇదే చివరిసారి కావొచ్చు..అయినా ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో

United States

Updated On : September 15, 2023 / 12:03 PM IST

United States : అక్కచెల్లెళ్ల అనుబంధం చాలా ప్రత్యేకమైనది. చెల్లెళ్లను ప్రేమానురాగాలతో చూసుకుంటారు. తల్లి తరువాత తల్లిలా ప్రేమను పంచుతారు. పెళ్లిళ్లై కుటుంబం నుంచి దూరంగా వెళ్లినా కష్టసుఖాలు పంచుకుంటారు. ఇద్దరు తోబుట్టువుల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకరికి 94.. ఒకరికి 90.. అంత పెద్ద వయసులో అక్క తన పుట్టినరోజు చెల్లి దగ్గర జరుపుకోవడం కోసం చాలా దూరం ప్రయాణం చేసి వెళ్లింది. ఆ వయసులో వీరి కలయిక ఇదే చివరి సారి కావచ్చునేమో? కానీ వారు పంచుకున్న ఆనందం చూస్తే మీరు ఫిదా అయిపోతారు.

Positive Parenting Tips : మీ పిల్లలతో అనుబంధం పెంచే 10 సూత్రాలు

కరోనా మహమ్మారి కారణంగా కొన్ని సంవత్సరాల ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. తమ కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని, ఆప్తుల్ని కలుసుకోలేకపోయారు. అలాగే వయోభారంలో ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలుసుకోలేకపోయారు. కానీ వారు కలిసుకునే ఘడియ వచ్చింది. యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన బార్బరా వయసు 94 ఏళ్లు.. చెల్లెల్లు షిర్లీ 90. వీరిద్దరు వృద్ధాప్యం, కరోనా మహమ్మారి కారణంగా చాలా సంవత్సరాలుగా కలుసుకోలేకపోయారు. న్యూ హాంప్‌షైర్‌లో ఉంటున్న బార్బరా తన పుట్టినరోజు సందర్భంలో తన చెల్లెలు షిర్లీని కలవాలనుకుంది.  తన మనవరాలు స్టెఫానీ అట్కిన్సన్ షివేలీ సాయంతో న్యూ హాంప్‌షైర్ నుండి నెవాడా వరకు దాదాపుగా 2,700 మైళ్ల కష్టతరమైన ప్రయాణం చేసి చెల్లెల్ని కలుసుకుంది.

Ulas family walks : అచ్చం ఆదిమానవుల్లా, ఈనాటికీ నాలుగు కాళ్లతో నడుస్తున్న కుటుంబం ..

బార్బరా, షిర్లీ కలుసుకున్న క్షణం సంతోషంలో మునిగిపోయారు. చాలాకాలంగా ఒకరినొకరు చూసుకోకుండా ఉన్నారేమో వారి ఆనందం మాటల్లో చెప్పలేం. సంతోషంగా డ్యాన్స్ చేసారు. కొన్నిరోజులు కలిసి గడిపారు. వయస్సు, ప్రయాణ కష్టాల కారణంగా ఈ అక్కాచెల్లెళ్లు ఒకరినొకరు వ్యక్తిగతంగా కలుసుకోవడం ఇదే చివరిసారి కావచ్చునని బార్బరా మనవరాలు షివేలీ చెప్పడం కాస్త బాధ కలిగించింది. కానీ బార్బరా, షివేలీల అనుబంధం చూస్తే చూడ ముచ్చటగా అనిపించింది. అక్కా చెల్లెళ్లు డ్యాన్స్ చేస్తుండగా షివేలీ తీసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Stephanie Shively/Realtor (@stephanie_communityrealtor)