Lula da Silva: అధ్యక్షుడి నుంచి కరప్షన్ ఖైదీ.. మళ్లీ అధ్యక్షుడిగా లులా డ సిల్వా

2003 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకూ ఎనిమిదేళ్ల పాటు వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలి. ఒకవేళ మళ్లీ ఆ పదవికి పోటీ చేయాలంటే.. కనీసం నాలుగేళ్లు ఆగాలి. ఈ నేపథ్యంలో 2011 జనవరి 1వ తేదీన లులా పదవి నుంచి తప్పుకున్నారు. లులా పదవి నుంచి దిగిపోయేటప్పటికి ఆయనకు 80 శాతం పైగా ప్రజా మద్దతు ఉంది.

Lula da Silva: ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ నేత లులా డ సిల్వా విజయం సాధించారు. 20 ఏళ్ల క్రితం మొదటి సారి దేశాధ్యక్షుడిగా గెలిచిన ఆయన.. మధ్యలో అవినీతి కేసులతో జైలు జీవితం గడిపారు. అనంతరం జైలు నుంచి విడుదలై ప్రభుత్వంపై నిర్విరామ పోరాటం చేసి ఎట్టకేలకు మరోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా గెలుపొందారు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బ్రెజిల్ అధ్యక్షుడి వరకు సాగిన ప్రయాణం ఆసక్తికరం.

పూర్తి పేరు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా. 1945లో ఈశాన్య బ్రెజిల్‌లో ఓ పేద కుటుంబంలో పుట్టారు. ఏడేళ్ల వయసులో ఉండగా మిగిలిన పేద కుటుంబాల లాగానే వారి కుటుంబం సైతం పని వెదుక్కుంటూ సావో పౌలోకు వలస వచ్చింది. కుటుంబం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పదేళ్ల వయసు వచ్చే వరకూ లులా చదువుకోలేదు. ఆయన 14 ఏళ్ల వయసులో సావో పౌలో శివార్లలో ఓ కార్ల కర్మాగారంలో లోహ కార్మికుడిగా పనికి కుదిరాడు. అక్కడి నుంచి కార్మిక నాయకుడిగా ఎదిగారు.

లులాకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ మొదటి భార్య చనిపోయిన ఏడాది అనంతరం 1970లో రాజకీయాల్లో చేరారు. 1975లో లక్ష మంది సభ్యులున్న మెటల్ వర్కర్స్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. అప్పటివరకూ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న కార్మిక సంఘాలను బలమైన స్వతంత్ర్య ఉద్యమంగా మలిచారు. 1970లలో బ్రెజిల్ సైనిక పాలకులను ధిక్కరిస్తూ వేతనాల పెంపు కోసం కార్మికులు చేపట్టిన సమ్మెల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. వర్కర్స్ పార్టీ తరపున కార్మిక సంఘాల నేతలు, మేధావులు, కార్యకర్తలను ఏకం చేయడంలో లులా విజయం సాధించారు. అనంతరం వర్కర్స్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన లులా డ సిల్వా మూడు సార్లు విఫలమయ్యాక.. నాలుగోసారి 2002లో అధ్యక్షుడిగా గెలిచారు. బ్రెజిల్‌ మొట్టమొదటి కార్మిక వర్గ అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.

Woman Kills Boyfriend : దారుణం.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు

2003 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకూ ఎనిమిదేళ్ల పాటు వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలి. ఒకవేళ మళ్లీ ఆ పదవికి పోటీ చేయాలంటే.. కనీసం నాలుగేళ్లు ఆగాలి. ఈ నేపథ్యంలో 2011 జనవరి 1వ తేదీన లులా పదవి నుంచి తప్పుకున్నారు. లులా పదవి నుంచి దిగిపోయేటప్పటికి ఆయనకు 80 శాతం పైగా ప్రజా మద్దతు ఉంది.

ఇక 2013లో బస్సు చార్జీల పెంపుపై నిరసనగా మొదలైన ఆందోళనలు దేశంలో అవినీతి మీద ఆగ్రహజ్వాలలుగా మారాయి. బడ్జెట్ చట్టాలను ఉల్లంఘించారంటూ 2016 ఆగస్టులో అభిశంసన ద్వారా దిల్మాను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈ క్రమంలో మాజీ అధ్యకషుడు లులా డిసిల్వా కూడా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. బ్రెజిల్‌కు చెందిన ఒక నిర్మాణ సంస్థకు ప్రభుత్వ చమురు సంస్థ పెట్రోబ్రాస్ కాంట్రాక్టులు ఇచ్చిందని, దానికి బీచ్ వద్ద అపార్ట్‌మెంటును లంచంగా పుచ్చుకున్నారన్న కేసులో 2017 జూలైలో కోర్టు లులాను దోషిగా తేల్చి జైలు శిక్ష ఖరారు చేసింది.

అయితే జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఆయన కొన్ని నెలలు పోరాటం చేశారు. అయితే ఎట్టకేలకు 2018లో జైలుకు వెళ్లారు. అప్పటికే వర్కర్స్ పార్టీ ఆయనను అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, జైలుకు వెళ్లడం వల్ల పోటీ చేయలేకపోయారు. నాలుగేళ్ల అనంతరం 2021లో ఆయనపై ఉన్న కేసుల్ని ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో 50.9 శాతం ఓట్లు సాధించిన లులా.. లేబర్ పార్టీ నేత జెయిర్ బొల్సొనారాను ఓడించారు. బ్రెజిల్‭కు లులా అధ్యక్షుడు కావడం ఇది మూడోసారి.

Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో నలుగురి అరెస్టు.. కొనసాగుతున్న విచారణ

ట్రెండింగ్ వార్తలు