Coronavirus ప్రపంచాన్ని భయపెడుతోంది. కొంతకాలంగా చైనాను వణికిస్తున్న ఈ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ మృతుల సంఖ్య
Coronavirus ప్రపంచాన్ని భయపెడుతోంది. కొంతకాలంగా చైనాను వణికిస్తున్న ఈ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది. చైనాలోని వూహన్(Wuhan) నగరంలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్.. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇప్పటికే కరోనా వైరస్ సోకి 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 2వేల కరోనా కేసులు నమోదైనట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. చైనాలో వూహాన్ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ మెల్లమెల్లగా అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంగ్ కాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్ ల్యాండ్, వియత్నాం తదితర దేశాలకు వ్యాపించింది.
Coronavirus ఎఫెక్ట్ చైనాపై మాములూగా లేదు. ఈ వైరస్ చైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైరస్ భయంతో చైనాకు వెళ్లే టూరిస్టుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. చైనాలోని మకావు ప్రపంచంలోనే అతిపెద్ద కేసినో హబ్(జూద నగరం) గా గుర్తింపు పొందింది. ఈ జూద నగరంపైనా కరోనా వైరస్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. నిత్యం టూరిస్టులతో కళకళలాడిన ఈ జూద నగరం.. ఇప్పుడు దెయ్యాల నగరంలా మారింది. కేసినోకి హబ్ కి వచ్చే విజిటర్ల సంఖ్య 69శాతానికి పడిపోయింది. ప్రస్తుతం మకావు బోసిపోయింది.
టూరిస్టులు లేక కేసినో హబ్ వెలవెలబోతోంది. బిజినెస్ తగ్గిపోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఈగలు తోలుకునే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. coronavirus తో చైనాలో ఇప్పటివరకు 132 మంది చనిపోయారు. ఒక్క బుధవారం(జనవరి 29,2020) రోజే 1500 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
Also Read : కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అప్పుడే చెప్పారా ?