Machu Picchu First Carbon Neutral Tourist Hub In World (1)
machu picchu first carbon neutral tourist hub in world : మాచు పిచ్చు. ప్రపంచ వింతల్లో ఒకటి. సముద్ర మట్టానికి 2,430 మీటర్ల (7,970 అడుగులు) ఎత్తునున్న 15 వ శతాబ్దపు ప్రదేశం ఇది. పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ప్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. మాచు పిచ్చు కార్బన్ న్యూట్రల్ సర్టిఫికెట్ అందుకున్న తొలి అంతర్జాతీయ పర్యాటక స్థలంగా గుర్తింపు పొందటం విశేషం. పర్యావరణహిత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే గ్రీన్ ఇనిషియేటివ్ సంస్థ సహజ అభయారణ్యమైన మాచు పిచ్చుకు ఈ సర్టిఫికెట్ ఇవ్వటంతో పాటు పర్యావరణ స్థిరత్వం విషయంలో మాచు పిచ్చును ఓ అంతర్జాతీయ సూచికగా గుర్తించింది.
కార్బన్ న్యూట్రల్ సర్టిఫికెట్ అంటే ఏంటీ?
ఈ కార్బన్ న్యూట్రల్ సర్టిఫికేషన్ ప్రకారం.. మచ్చు పిచ్చు ప్రాంతంలో కార్బన్‌డైఆక్సైడ్ ఉద్గారాలను భారీగా తగ్గించాల్సి ఉంటుంది. దీనికి ఓ నిర్ధిష్టమైన సమయాన్ని కూడా నిర్ణయించింది. దాంట్లో భాగంగా
2030లోపు సీఓ2 ఉద్గారాలను 45 శాతం మేరకు తగ్గించాల్సి ఉంటుంది. అలాగే 2050 వచ్చేసరికి నూటికి 100 శాతం తగ్గించాలి. ఇప్పటికే మాచు పిచ్చు పలు పర్యావరణరహిత కార్యక్రమాలు నిర్వహించి ఈ సర్టిఫికెట్ ను సాధిచింది.
పెరులో ఒకే ఒక్క సేంద్రీయ వ్యర్ధాల నిర్వహణా ప్లాంట్ ఉంది.అది మాచు పిచ్చులోనే ఉంది. ఈ ప్లాంట్ ద్వారా చెత్తను సహజ బొగ్గుగా మారుస్తారు. ఇళ్లు, రెస్టారెంట్లు పారేసే కూరగాయల వ్యర్థాల నుంచి బయోడీజిల్, గ్లిజరిన్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా..ఇక్కడ తిరిగి అడవులను పెంచే కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. నేషనల్ సర్వీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ నేచురల్ ఏరియాస్ ఆధ్వర్యంలో 10 లక్షల మొక్కలను నాటారు.