Magic Mushrooms Reduce Mental Stress : మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించే మ్యాజిక్ పుట్ట‌గొడుగులు

మాన‌సిక ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డడానికి చాలా మంది సైకోథెర‌పీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంద‌రిలో డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు త‌గ్గ‌వు. అలాంటివారికి మ్యాజిక్ పుట్ట‌గొడుగుల ట్రీట్మెంట్ చేస్తే డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తార‌ని మెడిసిన‌ల్ జ‌ర్న‌ల్‌లో వ‌చ్చిన‌ ఒక అధ్యయనం చెప్తోంది.

Magic mushrooms reduce Mental stress

Magic Mushrooms Reduce Mental stress : మాన‌సిక ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డడానికి చాలా మంది సైకోథెర‌పీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంద‌రిలో డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు త‌గ్గ‌వు. అలాంటివారికి మ్యాజిక్ పుట్ట‌గొడుగుల ట్రీట్మెంట్ చేస్తే డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తార‌ని మెడిసిన‌ల్ జ‌ర్న‌ల్‌లో వ‌చ్చిన‌ ఒక అధ్యయనం చెప్తోంది. లండ‌న్‌కి చెందిన కంపాస్ పాథ్‌వేస్ అనే మెంట‌ల్ హెల్త్ కేర్ కంపెనీ ఈ అధ్యయనం చేసింది.

డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న 233మందిని రెండు గ్రూపులుగా చేసి, కొంద‌రికి సిలోసిబిన్ అనే మ్యాజిక్ పుట్టగొడుల్ని 25 మిల్లీ గ్రాముల డోస్‌ ఇచ్చారు. మిగ‌తావాళ్ల‌కు త‌క్కువ డోస్ ఇచ్చారు. మూడు వారాల త‌ర్వాత రెండు గ్రూపుల వాళ్ల‌ని గ‌మ‌నించారు. 25 మి.గ్రా. సిలోసిబిన్ తీసుకున్న‌వారిలో డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు త‌గ్గ‌డాన్ని ప‌రిశోధ‌కులు గ‌మ‌నించారు.

Risk of depression: ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాన్ని గంటల తరబడి చేసేవారికి కుంగుబాటు ముప్పు
‘సిలోసిబిన్‌లోని సైకోయాక్టివ్ పదార్థాలు ఎమోష‌న్స్‌ని కంట్రోల్ చేసే మెద‌డు భాగం మీద ప్ర‌భావం చూపిస్తాయని, దాంతో ఒత్తిడి ల‌క్ష‌ణాల్ని త‌గ్గిస్తాయని ఈ స్ట‌డీలో పాల్గొన్న జేమ్స్ రుక‌ర్‌ అనే క‌న్స‌ల్టెంట్ సైకియాట్రిస్ట్ చెబుతున్నాడు. అయితే, ఈ మ్యాజిక్ పుట్ట‌గొడుగుల ప‌రిశోధ‌న‌ ప్రస్తుతం మ‌ధ్య‌స్త ద‌శ‌లో ఉందని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇవి అందుబాటులోకి వ‌స్తే డిప్రెష‌న్ స‌మ‌స్య ఉన్న‌వారు తొంద‌ర‌గా కోలుకోవ‌చ్చని ప‌రిశోధ‌కులు అంటున్నారు.