Risk of depression: ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాన్ని గంటల తరబడి చేసేవారికి కుంగుబాటు ముప్పు

ఒత్తిడితో కూడుకుని ఉండే ఉద్యోగాన్ని గంటల తరబడి చేసేవారికి కుంగుబాటు ముప్పు అధికంగా ఉంటుందని అమెరికా పరిశోధకులు గుర్తించారు. వారంలో వారానికి 40-45 గంటలు పనిచేసే వారి కంటే 90 గంటలు పనిచేసే వారిలో కుంగుబాటు ముప్పు మూడురెట్లు అధికంగా ఉంటుందని చెప్పారు. వారిలో చాలా మందికి వైద్య చికిత్స తీసుకునే తీసుకునే అవసరం వస్తుందని తెలిపారు. దాదాపు 17 వేల మంది వైద్య విద్యార్థులపై 11 ఏళ్ల పాటు చేసిన పరిశోధనల ఫలితంగా ఈ విషయాన్ని మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు.

Risk of depression: ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాన్ని గంటల తరబడి చేసేవారికి కుంగుబాటు ముప్పు

Risk of depression: ఒత్తిడితో కూడుకుని ఉండే ఉద్యోగాన్ని గంటల తరబడి చేసేవారికి కుంగుబాటు ముప్పు అధికంగా ఉంటుందని అమెరికా పరిశోధకులు గుర్తించారు. వారంలో వారానికి 40-45 గంటలు పనిచేసే వారి కంటే 90 గంటలు పనిచేసే వారిలో కుంగుబాటు ముప్పు మూడురెట్లు అధికంగా ఉంటుందని చెప్పారు. వారిలో చాలా మందికి వైద్య చికిత్స తీసుకునే తీసుకునే అవసరం వస్తుందని తెలిపారు.

దాదాపు 17 వేల మంది వైద్య విద్యార్థులపై 11 ఏళ్ల పాటు చేసిన పరిశోధనల ఫలితంగా ఈ విషయాన్ని మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్య విద్య అభ్యసిస్తున్న మొదటి సంవత్సర విద్యార్థుల అదనపు గంటలు పనిచేయాల్సి వస్తుందని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేశామని చెప్పారు.

వారిలో కుంగుబాటు లక్షణాలు, వారి పని గంటలు, నిద్ర, ఇతర అంశాలపై అధ్యయనం చేశామని తెలిపారు. అదనంగా పనిచేస్తున్న వారిలో కుంగుబాటు లక్షణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వారాంతపు పని గంటల సంఖ్య తగ్గించుకోవాలని సూచించారు. తక్కువ పనిగంటలు ఉంటే ఉద్యోగులు ఒత్తిడి, చిరాకును ఎదుర్కొని పనిచేయగలరని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..