Mahatma Gandhi statue: 8 అడుగుల మహాత్ముని కాంస్య విగ్రహం ధ్వంసం

న్యూయార్క్ లోని 8అడుగుల ఎత్తున్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనపై ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ షాకింగ్ కు గురైంది.

Mahatma Gandhi statue: న్యూయార్క్ లోని 8అడుగుల ఎత్తున్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనపై ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ షాకింగ్ కు గురైంది. Manhattan సమీపంలోని యూనియన్ స్క్వేర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది.

‘విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని న్యూయార్క్ లో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపై వెంటనే దర్యాప్తు జరపాలని స్థానిక అధికారులతో పాటు, యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ ను కోరాం. ఘటనకు పాల్పడిన వారికి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నామని’ కాన్సులేట్ తెలిపింది.

మహాత్ముని 117వ జన్మదినం సందర్భంగా 1986 అక్టోబర్ 2న గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ 8అడుగుల కాంస్య విగ్రహాన్ని డొనేట్ చేసింది. 2001లో విగ్రహాన్ని తొలగించినప్పటికీ 2002లో మరోసారి ప్రతిష్టాపించారు.

గత నెలలోనూ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న గాంధీ విగ్రహంపై దాడి జరిగింది. కొంత భాగం విరిగిపడిపోయింది. గాంధీ వ్యతిరేకులు, యాంటీ ఇండియా సంస్థలు చేపడుతున్న ఆందోళనలకు వ్యతిరేకంగా నాలుగేళ్ల క్రితం విగ్రహాన్ని ఏర్పాటు చేసింది సిటీ కౌన్సిల్.

ట్రెండింగ్ వార్తలు