Mammoth 300-feet Sinkhole: షాకింగ్.. మెక్సికో‌లో 300 అడుగుల సింక్ హోల్.. ఇళ్లను మింగేసేలా ఉంది!

ప్రకృతి వైపరీత్యాలు అత్యంత భయానకంగా ఉంటాయనడంలో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.. ఇటీవల మెక్సికో‌లో భూమిపై బిలంలా కనిపించే ఓ భారీ సింక్ హోల్ ఉద్భవించింది.

Mammoth 300 Feet Sinkhole In Mexico Terrifies The Locals Threatens To Swallow Homes

Mammoth 300-feet Sinkhole : ప్రకృతి వైపరీత్యాలు అత్యంత భయానకంగా ఉంటాయనడంలో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.. ఇటీవల మెక్సికో‌లో భూమిపై బిలంలా కనిపించే ఓ భారీ సింక్ హోల్ ఉద్భవించింది. చూస్తుండగానే.. అంతకంతకు పెద్దదిగా పెరిగిపోతూ చుట్టూ స్థలానంతా మింగేస్తోంది. పక్క భవనాలను కూడా మింగేసేలా స్థలాన్ని మింగేస్తోంది.


ఈ భయానక దృశ్యాన్ని చూసి స్థానిక మెక్సికన్ ప్రజలంతా భయంతో బెంబేలెత్తిపోతున్నారు. మొదట కొన్ని మీటర్ల సైజులో మాత్రమే కనిపించిన ఈ సింక్ హోల్.. 70వేల స్క్వేర్ ఫీట్ పంటపొలాన్ని మింగేసింది. అంతరిక్ష నౌక ఢీకొట్టడం వల్లే ఈ భారీ సింక్ హోల్ ఏర్పడి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్యూబ్లా రాష్ట్రంలోని సింక్‌హోల్ 60 మీటర్ల వ్యాసానికి పెరిగింది. ఇది ఇంకా పెరగచ్చని అంటున్నారు.

60 అడుగుల లోతులో ఈ సింక్ హోల్ ఉండచ్చని అంచనా. పంటపొలాలను ఆక్రమించిన ఈ సింక్ హోల్ సమీపంలో ఉన్న ఇళ్లను కూడా మింగేసేలా కనిపిస్తోంది. అక్కడి ప్రజలను ఖాళీ చేయించి సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. పంట నష్టం తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూమి ఉపరితలంపై పట్టులేనప్పుడు సింక్ హోల్స్ ఇలా సంభవిస్తాయి.


భూగర్భజలాల ఉధృతి కారణంగా భూమి ఉపరితలం క్రింద రాతి కోత ఏర్పడుతుంది. ఫలితంగా భూగర్భ ప్రాంతం పెళుసుబారి ఖాళీ స్థలం ఏర్పడుతుంది. దాంతో భూమిపై ఉపరితలమంతా కిందికి కుంగిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.