×
Ad

Guinness Records : తలతో 46 టాయిలెట్ సీట్లు పగులగొట్టి..గిన్నీస్ రికార్డు

  • Published On : May 4, 2021 / 04:31 PM IST

Record For Most Toilet Seats Broken By Head In 1 Minute

toilet seats broken Guinness World Records :‘గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్’ సాధించాలను చాలామంది రకరకాలుగా ట్రై చేస్తుంటారు. ఆ క్రమంలో కాళ్లూ చేతులు,తలలు పగులగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చేతులపై కార్లు ఎక్కించుకోవటం. లారీలను తాళ్లతో లాగేయటం, తలతో కొబ్బరి బోండాలు బద్దలు కొట్టటం ఇలా ఎన్నో రకాలుగా గిన్నీస్ రికార్డ్ కోసం చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి గిన్నీస్ రికార్డు సాధించిన కాన్సెప్ట్ చూస్తే డిఫరెంట్ అనిపిస్తుంది. డిఫరెంట్ అయినవే రికార్డ్ అవుతాయంటారా?నిజమే మరి..ఇది కూడా డిఫరెంటే..కాబట్టి గిన్నిస్ రికార్డు సొంతమైంది. ఎలాగంటే..తలతో టాయ్ లెట్ సీట్లు పగుల గొట్టటం..

ఇద్దరు వ్యక్తులు గిన్నీస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయటానికి తలతో తలపడ్డారు. టాయిలెట్ సీట్లను తలతో పగలగొట్టేందుకు రెడీ అయ్యారు.అలా ఇద్దరూ పోటాపోటీగా తలతో 43 నుంచి 46 టాయిలెట్ సీట్లను పగలగొట్టేసారు. ‘గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్’కు చెందిన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా కాన్సెప్ట్ లోకి వెళితే..పోటీకి సిద్ధమైన వీరిద్దరిలో ఎవరు ఎక్కువ టాయిలెట్ సీట్లు బద్దలకొడతారో.. వారే విజేత. ఈ పోటీని గిన్నీస్ బుక్ రికార్డుల్లో కూడా నమోదవుతుంది. దీంతో పోటీ మహా రంజుగా సాగింది. పోటీలో నువ్వా నేనా? అన్నట్లుగా ఇద్దరూ గట్టి పోటీ ఇచ్చుకున్నారు. ఈ పోటీలో భాగంగా చెక్కతో తయారు చేసిన టాయిలెట్ సీట్లను తలతో బద్దలుకొట్టాలి. అది కూడా ఒకే ఒక్క నిమిషంలో. మొదటి వ్యక్తి 43 టాయిలెట్ సీట్లు తలతో బద్దలకొట్టాడు. రెండో వ్యక్తి మొత్తం 46 టాయిలెట్ సీట్లను పగలగొట్టి.. గిన్నీస్ రికార్డును బద్దలకొట్టాడు. “హెడ్-టు-హెడ్ టాయిలెట్ సీట్ బ్రేకింగ్ యుద్ధం పూర్తి అయ్యింది ఓ వ్యక్తి రికార్డు క్రియేట్ చేశాడు.  ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండీ..

https://youtu.be/QsFAITPdmA0