United States : అద్దెకు ఇచ్చిన పుస్తకం 96 సంవత్సరాలకి లైబ్రరీకి తిరిగి వచ్చింది

ఓ లైబ్రరీలో అద్దెకు ఇచ్చిన పుస్తకం 96 సంవత్సరాల తర్వాత తిరిగి రిటర్న్ వచ్చింది. ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆ లైబ్రరీ ఇంకా కొనసాగుతూ ఉంటం విశేషం. ఇక పుస్తకం రూపురేఖలు మారిపోయినా అద్భుతమైన పుస్తకం అంటున్నారు అక్కడి సిబ్బంది.

book came to the library after 96 years : ఎవరైనా లైబ్రరీలో అద్దెకు పుస్తకం తీసుకుంటే మహా లేట్ అయితే ఒక నెల పట్టొచ్చు. కానీ ఒక వ్యక్తి తీసుకెళ్లిన పుస్తకం తిరిగి 96 సంవత్సరాల తర్వాత లైబ్రరీకి చేరింది. ఏంటా పుస్తకం అంటే..

Tanvi Marupallyz: లైబ్రరీలో చిక్కింది.. 75 రోజుల తరువాత యూఎస్‌లో తల్లిదండ్రుల వద్దకు చేరిన తెలుగమ్మాయి తన్వి..

యునైటెడ్ స్టేట్స్ లోని సెయింట్ హెలెనా పబ్లిక్ లైబ్రరీలో 1927 లో బెన్సన్ లాసింగ్ అనే రచయిత రాసిన ‘హిస్టరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్’ అనే పుస్తకం రిలీజ్ అయ్యింది. ఓ వ్యక్తి ఆ పుస్తకాన్ని అదే సంవత్సరం ఫిబ్రవరి 21న అద్దెకు తీసుకెళ్లాడు. అయితే దానిని 2023 లో తిరిగి ఇచ్చాడు. అంటే దాదాపుగా వంద సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం తిరిగి అదే లైబ్రరీకి చేరింది. ఆశ్చర్యం కలిగించే విషయం కదా. సెయింట్ హెలెనా పబ్లిక్ లైబ్రరీ ఈ కథనాన్ని ఇటీవల తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకుంది. పుస్తకం ఆకర్షణీయమైన చిత్రాలతో పాటు ఎంతో అద్భుతంగా ఉంది.

CM MK Stalin : 2లక్షల 50 వేల పుస్తకాలతో అధునాతన లైబ్రరీ నిర్మిస్తున్న సీఎం స్టాలిన్

లైబ్రరీ డైరెక్టర్ క్రిస్ క్రీడెన్ తన సిబ్బందిలో ఒకరు ఈ పుస్తకాన్ని తీసుకువచ్చి ఇచ్చారని.. ఇది నిజంగా చాలా బాగుందని.. ఇంత పాత పుస్తకమని తమకు ముందు తెలియలేదని అన్నారు. ఇక ఈ కథనం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ‘పుస్తకం సరిగా తిరిగి ఇవ్వబడలేదని’ ..’1927 లో ఆలస్యంగా బుక్ రిటర్న్ చేస్తే రోజుకి 5 సెంట్లు ఫైన్ ఉండేదని.. అది ఇప్పటి డబ్బుతో పోలీస్తే ఒక డాలర్‌కు సమానమని’ కామెంట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు