Man Swallows Nokia Phone : నోకియా 3310 మోడల్ ఫోన్ మింగేసిన బాలుడు.. తర్వాత ఏమైందంటే…..

చిన్నపిల్లలు ఆడుకునేప్పుడో.... ఏమరుపాటుగా ఉన్నప్పుడో చిన్న చిన్న వస్తువులను, రూపాయి కాయిన్స్ ను మింగేస్తూ ఉంటారు. అవి బయటకు తీయటానాకి నానా కష్టాలు పడతాం.

Man Swallows Nokia Phone : చిన్నపిల్లలు ఆడుకునేప్పుడో…. ఏమరుపాటుగా ఉన్నప్పుడో చిన్న చిన్న వస్తువులను, రూపాయి కాయిన్స్ ను మింగేస్తూ ఉంటారు. అవి బయటకు తీయటానాకి నానా కష్టాలు పడతాం. అంత సేపు వాళ్ల బాధవర్ణనాతీతం.. కానీ ఒక 33 ఏళ్ల వ్యక్తి ఏకంగా నోకియా 3310 మోడల్ ఫోన్ మింగేశాడు.

సెల్ ఫోన్ల యుగం మొదలైన కొత్తల్లో నోకియా ఫోన్ కు ఉన్న డిమాండ్ అంతా… ఇంతా…కాదు… బాగా పాపులర్ అయిన బ్రాండ్. అందులో 1100,1108 లతో పాటు 2000 సంవత్సరంలో విడుదలైన 3310 కూడా బాగా పాపులర్ అయ్యింది. ఆగ్నేయ ఐరోపాలోని కోసావోకి చెందిన 33 ఏళ్ల వ్యక్తి ఇటీవల నోకియా 3310 ఫోన్ ను మింగేశాడు. ఎందుకు మింగాడు.. ఎందుకు మింగాల్సి వచ్చిందో తెలియదు కానీ .. మింగిన తర్వాత మనోడికి కడుపునొప్పి మొదలైంది.

వెంటనే ఆస్పత్రికి చేరుకున్నాడు. డాక్టర్లకు విషయం చెప్పాడు. అది జీర్ణమయ్యే వస్తువైతే అందుకు అవసరమైన మందులు డాక్టర్లు ఇచ్చేవారు. సెల్ ఫోన్ ఎందుకు జీర్ణం అవుతుంది….అవలేదు. అప్పటికే కడుపులోకి వెళ్లిన ఫోన్ 3 గా విడిపోయింది. మరి కొద్దిసేపైతే బ్యాటరీ పేలిపోయి ఆవ్యక్తి ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ కు ఏర్పాట్లు చేసి ఆ వ్యక్తి కడుపులోని సెల్ ఫోన్ బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. విజయంవంతంగా ఆపరేషన్ చేసిన వైద్య బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ స్కెండర్ తెల్జాకు అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు