Musa Hasahya: 12 భార్యలు, 102 సంతానం అంనతరం సంచలన ప్రకటన చేసిన ఓ వ్యక్తి

ముసాకు 568 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఉగాండాలోని బుగిసాలో అతడికి 12 బెడ్‭రూంలు ఉన్న ఇళ్లు ఉంది. అయితే తన మనవలు, మనవరాళ్లు అందరి పేర్లు తెలియవని ముసా చెబుతున్నాడు. అతడు మొదటి పెళ్లి 1971లో చేసుకున్నాడు. అప్పుడు అతడి వయసు 16 సంవత్సరాలు. ఆ రెండేళ్లకే కూతురు పుట్టడంతో అతడు మొదటిసారి తండ్రి అయ్యాడు

Musa Hasahya: 12 భార్యలు, 102 మంది సంతానం అనంతరం ఓ వ్యక్తం సంచలన ప్రకటన చేశాడు. ఇక తాను పిల్లల్ని కనబోనని ప్రకటించాడు. తన భార్యలు పిల్లలు పుట్టకుండా ప్రస్తుతం మందులు వాడుతున్నారని, ఇకపై పిల్లల్ని కనబోనని ప్రకటించేశాడు. ఉగాండాకు చెందిన ముస హసహ్య(67) అనే వ్యక్తి చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుండగా, వంద మంది పిల్లల్ని కన్నాక ఈ ఆలోచన రావడం గమనార్హం అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Salman Khan : సల్మాన్ ఖాన్‌కి వెంకీ మామ బర్త్ డే విషెస్.. వైరల్ అవుతున్న ఫోటో!

అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని ముసా వెల్లడించాడు. కుటుంబ పోషణకు తన ఆదాయం సరిపోవడం లేదట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయమై అతడు మీడియాతో మాట్లాడుతూ ‘‘నా దగ్గర ఉన్న పరిమిత వనరుల కారణంగా కుటుంబ మరింత విస్తృతమైతే మరింత భారం అవుతుంది. అందుకే ఇకపై పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నాను. నా భార్యలకు ఇదే విషయాన్ని స్పష్టం చేశాను. వాళ్లు ఇందుకు ఒప్పుకున్నారు. ప్రస్తుతం వాళ్లు పిల్లలు కాకుండా మందులు వాడుతున్నారు’’ అని తెలిపాడు.

Maha vs Karnataka: ఉద్ధవ్ థాకరే చేసిన డిమాండ్ మేరకు అసెంబ్లీ తీర్మానానికి సిద్దమైన సీఎం షిండే

ముసాకు 568 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఉగాండాలోని బుగిసాలో అతడికి 12 బెడ్‭రూంలు ఉన్న ఇళ్లు ఉంది. అయితే తన మనవలు, మనవరాళ్లు అందరి పేర్లు తెలియవని ముసా చెబుతున్నాడు. అతడు మొదటి పెళ్లి 1971లో చేసుకున్నాడు. అప్పుడు అతడి వయసు 16 సంవత్సరాలు. ఆ రెండేళ్లకే కూతురు పుట్టడంతో అతడు మొదటిసారి తండ్రి అయ్యాడు. గ్రామ చైర్‌పర్సన్‌ అయిన ముస, వ్యాపారవేత్త కూడా. తనకు డబ్బు, భూమి ఉన్నందున కుటుంబాన్ని పెంచుకోవాలని అనుకున్నాడట. అందుకే ఎక్కువ మంది భార్యల్ని చేసుకున్నట్లు తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు