లిప్ టూ లిప్ కాదు మాస్క్ టూ మాస్క్: ముద్దులు పెట్టుకోవటానికి కొత్త జంటల తిప్పలు..!! 

  • Publish Date - February 24, 2020 / 07:00 AM IST

పెళ్లి చేసుకున్నారు..కానీ ముద్దు పెట్టుకోవాలంటే భయం. కారణం కరోనా వైరస్ భయం. దీంతో సామూహిక వివాహాలు చేసుకున్న 220 మంది జంటలు ముద్దులు పెట్టుకోవటానికి పడే తిప్పలు చూస్తుంటే పాపం కదూ అనిపిస్తోంది. 

వివరాల్లోకి వెళితే..ఫిలిప్పైన్స్‌లోని సముద్రతీరంలో ఉన్న నగరం బాకొలాడ్‌. ఆ ప్రాంతంలోని  సిటీహాల్‌లో ప్రభుత్వం సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 220మంది జంటలు ఒక్కటయ్యారు. పెండ్లి కొడుకులు తెల్లని అంగీలు, పెండ్లి కూతుళ్లు తెల్లరంగు గౌన్లు వేసుకుని ఈ సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. దీంతో  సిటీహాల్‌ అంతా పాల సముద్రంలా మారిపోయింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం విశేషం ఏమిటంటే ఈ పెళ్లి కూతుళ్లు,పెళ్లి కొడుకులు మాస్క్ లు పెట్టుకున్నారు. 

See Also>> ఆపరేషన్ థియేటర్‌లో గవర్నమెంట్ డాక్టర్ Tiktok వీడియో..!!

కరోనా వైరస్‌ భయంతో సామూహిక వివాహ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. మాస్క్ లు ధరించటం తప్పనిసరి చేశారు.అంతేకాదు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న వధువు, వరులతో పాటు అందరికీ ముందుగానే గత 14 రోజులుగా వారు ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశారనే వివరాలు సేకరించారు. ఎందుకంటే కరోనా వైరస్‌ సోకిన 14 రోజుల తర్వాతగానీ వ్యాధి లక్షణాలు బయటపడవు. అందుకే నిర్వాహకులు 14 రోజుల ప్రయాణ వివరాలు తీసుకున్నారు.

తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను కూడా పెట్టి అమలు చేశారు. దీంతో పెండ్లి పీటలెక్కిన జంటలు మాస్కులతోనే ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసుకున్నారు. ఆఖరికి పెళ్లి తరువాత వారు ముద్దులు కూడా మాస్కులు ధరించే పెట్టుకోవాల్సి వచ్చింది. మాస్కులతో ముద్దులు పెట్టుకోవడం ఇబ్బందిగానే ఉన్నా.. కరోనా భయంతో తప్పదుగా అని కొత్త జంటలు సరిపెట్టుకున్నారు. పాపం అనిపిస్తుంది కదూ…!!