Mass Shooting At Music Festival: యూఎస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో కాల్పులు, ఇద్దరి మృతి, ముగ్గురికి గాయాలు

అమెరికా దేశంలో మళ్లీ కాల్పులు జరిగాయి. యూఎస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.వాషింగ్టన్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా జార్జ్ పట్టణానికి సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌లో రాత్రి జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు....

అమెరికా మ్యూజిక్ ఫెస్టివల్ లో మళ్లీ కాల్పులు

Mass Shooting At Music Festival: అమెరికా దేశంలో మళ్లీ కాల్పులు జరిగాయి. యూఎస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.వాషింగ్టన్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా జార్జ్ పట్టణానికి సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌లో రాత్రి జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

Cyclone Biparjoy Brings Heavy Rain: రాజస్థాన్‌లో వెల్లువెత్తిన వరదలు, నలుగురి మృతి

గ్రాంట్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం, వాషింగ్టన్ జార్జ్ యాంఫీథియేటర్ సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌లో కాల్పులు జరిగాయి.జార్జ్ యాంఫీథియేటర్ బియాండ్ వండర్‌ల్యాండ్ పేరిట రెండు రోజుల సంగీత ఉత్సవాన్ని జరుపుతుండగా ఈ కాల్పుల ఘటన జరిగింది. కాల్పులు జరిగినప్పటికీ వండర్‌ల్యాండ్ ఉత్సవం కొనసాగింది.ఆదివారం ఉదయం, పండుగ రోజు ప్రదర్శనలను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అమెరికా దేశం వారాంతపు హింస,సామూహిక కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. స్ట్రింగ్‌లో  జరిగిన కాల్పుల్లో  పెన్సిల్వేనియా స్టేట్ ట్రూపర్‌తో సహా కనీసం ఆరుగురు మరణించగా,పలువురు గాయపడ్డారు.సబర్బన్ చికాగో, వాషింగ్టన్ స్టేట్, పెన్సిల్వేనియా, సెయింట్ లూయిస్, దక్షిణ కాలిఫోర్నియా బాల్టిమోర్‌లలో కాల్పులు జరిగాయి.

ట్రెండింగ్ వార్తలు