Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్.. సునామీ హెచ్చరికలు జారీ..
Japan Earthquake : జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
- Harish Thanniru
- Updated on- July 28, 2026 / 01:58 PM IST
Japan Earthquake
Japan Earthquake : జపాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. దేశ దక్షిణ ప్రాంతంలోని క్యూషూ ద్వీప సమీపంలో మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం అనంతరం తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.
Also Read : Meta Apologises : ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో బ్లాక్.. మెటా క్షమాపణలు.. అసలు కారణం ఇదేనట
భూకంపం కేంద్రం కుమమోటో ప్రిఫెక్చర్ సమీపంలో సముద్రంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో జపాన్ భూకంప తీవ్రత కొలమానమైన షిండో స్కేల్‌లో అత్యధిక స్థాయి 7 నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కుమమోటోతో పాటు నాగసాకి, కగోషిమా, ఫుకూవోకా, సాగ, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్లలో అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేశారు. సహాయక బృందాలు అప్రమత్తమయ్యాయి.
భూకంపం అనంతరం జపాన్ వాతావరణ సంస్థ తీర ప్రాంతాలకు సుమారు ఒక మీటర్ ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సముద్రానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే, ఈ భూకంపం కారణంగా ప్రాణం నష్టం జరిగిందా..? ఎక్కడైనా భవనాలు నేలమట్టం అయ్యాయా? అనే అంశాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
A pair of 5.7 and 5.8 magnitude earthquakes about an hour ago triggered landslides in Xinghai County, Qinghai Province, China. pic.twitter.com/b4GOFwrXM5
— Weather Monitor (@WeatherMonitors) July 28, 2026
Visuals from Aso Kumamoto Airport (KMJ), Japan during the massive M7.1 earthquake. (地震 ) pic.twitter.com/sLTMHBGGuj
— Weather Monitor (@WeatherMonitors) July 28, 2026
Live footage from Kumamoto Castle shows intense shaking and a haze of dust/smoke following a magnitude 7.1 earthquake (地震 ) that struck Kumamoto, Japan. pic.twitter.com/TAj1SqBLcH
— Weather Monitor (@WeatherMonitors) July 28, 2026
