Earthquake : తైవాన్‌లో భారీ భూకంపం

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తైపీతోపాటు ఈశాన్య తైవాన్‌లో ఆదివారం (అక్టోబర్ 24,2021)మధ్యాహ్నం 1.11 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 6.7గా నమోదు అయిందని తెలిపారు.

  • Published On : October 24, 2021 / 03:06 PM IST

Taiwan

earthquake in Taiwan : తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తైపీతోపాటు ఈశాన్య తైవాన్‌లో ఆదివారం (అక్టోబర్ 24,2021)మధ్యాహ్నం 1.11 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదు అయిందని తైవాన్‌ సెంట్రల్‌ వెదర్‌ బ్యూరో పేర్కొంది.

భూ అంతర్భాగం 67 కిలోమీటర్ల లోతులో భూమి పొరలు కదిలాయని వెల్లడించింది. భూ ప్రకంపనల వల్ల తైపీలో బిల్డింగ్స్ కొన్నిసెకన్ల పాటు ఊగిపోయాయని చెప్పారు. భూకంపం రావడంతో భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.

Kids Vaccine: పిల్లలపై పనిచేస్తున్న వ్యాక్సిన్ ఇదే!

భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇలాన్‌ కౌంటీలో 30 సెకండ్లపాటు భూమి కంపించిందని ఏఎఫ్‌పీ రిపోర్టర్‌ పేర్కొన్నారు.