Kids Vaccine: పిల్లలపై పనిచేస్తున్న వ్యాక్సిన్ ఇదే!

పిల్లలపై ఫైజర్ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని అమెరికా ఆహార, ఔషధ సంస్థ తెలిపింది.

Kids Vaccine: పిల్లలపై పనిచేస్తున్న వ్యాక్సిన్ ఇదే!

Longer 8 Week Gap Between Pfizer Doses Boosts Antibodies

Kids Vaccine: పిల్లలపై ఫైజర్ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని అమెరికా ఆహార, ఔషధ సంస్థ తెలిపింది. ఫైజర్​ అందించిన డేటాను పరిశీలించిన తర్వాత ఎఫ్‌డీఏ ఈ ప్రకటన చేసింది. పిల్లలకు కోవిడ్-19 సోకకుండా ఫైజర్​ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందని ట్రయల్స్‌లో వెల్లడైంది. 5 నుంచి పదకొండేళ్ల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ చేయాలని అగ్రరాజ్యం భావిస్తున్న తరుణంలో ఎఫ్‌డీఏ ఈ వ్యాఖ్యలు చేయడం ఊరటనిచ్చే అంశం.

అమెరికాలో వచ్చే వారంలో FDA ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరగనుంది. అందులో ఫైజర్ ఇచ్చిన​ డేటాను విశ్లేషించి, వివరాలను FDA విడుదల చేసింది. చిన్నారులకు టీకా ద్వారా కలిగే దుష్ప్రభావాలకన్నా.. మంచే ఎక్కువగా జరుగుతుందని ఎఫ్​డీఏ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. కొవిడ్​ సోకిన చిన్నారులు టీకా తీసుకుంటే చాలా సందర్భాల్లో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి రాదని, మరణం నుంచి కూడా రక్షణ లభిస్తుంది అభిప్రాయపడ్డారు.

5 నుంచి పదకొండేళ్ల వయసు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఎఫ్​డీఏ ఇంకా అనుమతులు ఇవ్వలేదు. మంగళవారం జరగనున్న సమావేశంలో స్వతంత్ర సలహాదారులతో కూడిన ప్యానెల్​ ఈ విషయంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత ఎఫ్​డీఏ తుది నిర్ణయానికొస్తుంది. ఒకవేళ ఎఫ్​డీఏ అనుమతులిస్తే.. అమెరికాలో నవంబర్​ ఫస్ట్ వీక్ నుంచి చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.