Longer 8 Week Gap Between Pfizer Doses Boosts Antibodies
Kids Vaccine: పిల్లలపై ఫైజర్ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని అమెరికా ఆహార, ఔషధ సంస్థ తెలిపింది. ఫైజర్ అందించిన డేటాను పరిశీలించిన తర్వాత ఎఫ్‌డీఏ ఈ ప్రకటన చేసింది. పిల్లలకు కోవిడ్-19 సోకకుండా ఫైజర్ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందని ట్రయల్స్‌లో వెల్లడైంది. 5 నుంచి పదకొండేళ్ల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ చేయాలని అగ్రరాజ్యం భావిస్తున్న తరుణంలో ఎఫ్‌డీఏ ఈ వ్యాఖ్యలు చేయడం ఊరటనిచ్చే అంశం.
అమెరికాలో వచ్చే వారంలో FDA ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరగనుంది. అందులో ఫైజర్ ఇచ్చిన డేటాను విశ్లేషించి, వివరాలను FDA విడుదల చేసింది. చిన్నారులకు టీకా ద్వారా కలిగే దుష్ప్రభావాలకన్నా.. మంచే ఎక్కువగా జరుగుతుందని ఎఫ్‌డీఏ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. కొవిడ్ సోకిన చిన్నారులు టీకా తీసుకుంటే చాలా సందర్భాల్లో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి రాదని, మరణం నుంచి కూడా రక్షణ లభిస్తుంది అభిప్రాయపడ్డారు.
5 నుంచి పదకొండేళ్ల వయసు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎఫ్‌డీఏ ఇంకా అనుమతులు ఇవ్వలేదు. మంగళవారం జరగనున్న సమావేశంలో స్వతంత్ర సలహాదారులతో కూడిన ప్యానెల్ ఈ విషయంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత ఎఫ్‌డీఏ తుది నిర్ణయానికొస్తుంది. ఒకవేళ ఎఫ్‌డీఏ అనుమతులిస్తే.. అమెరికాలో నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.