బ్రిటన్ ప్రధాని థెరిసా మే కు వ్యతిరేకంగా ప్రతిపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్ లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 19 ఓట్ల తేడాతో థెరిసా ప్రభుత్వం గెలుపొందింది. డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ) కి చెందిన 10మంది ఎంపీలు కూడా థెరిసాకు మద్దతుగా ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని థెరిసా మే మాట్లాడుతూ.. బ్రెగ్జిట్ పై చర్చలకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై త్వరగా ఓ నిర్ణయానికి రావాలని ఆమె కోరారు.
. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ తీర్మానాన్ని బుధవారం(జనవరి 16,2019) బ్రిటన్ పార్లమెంట్(హౌస్ ఆఫ్ కామన్స్) తిరస్కరించిన విషయం తెలిసిందే. తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ 432 మంది సభ్యులు ఓటువేయగా 202 మంది సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తూ ఓటు వేశారు.