Nasa Mars operation: నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)293మిలియన్ మైళ్ల (472 మిలియన్ కిలోమీటర్ల) దూరం ప్రయాణించి మార్స్ మీదకు చేరుకుంది. సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయిన తర్వాత.. ఈ మేరకు నాసా.. అంగారక గ్రహం మీద మార్స్ రోవర్ ల్యాండ్ అయిన చిత్రాన్ని గురువారం విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో మార్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయంవంతంగా ల్యాండ్ అయింది.
ఈ చారిత్రక మిషన్ టీంలో పనిచేసిన సైంటిస్టుల బృందంలో ఇండియన్-అమెరికన్ డా.స్వాతి మోహన్ ఉన్నారు. డెవలప్‌మెంట్ ఆఛప ఆటిట్యూడ్ కంట్రోల్, రోవర్ ల్యాండింగ్ సిస్టమ్ లో భాగంగా ఉన్నారు. నాటకీయ పరిణామంలో కొనసాగిన ల్యాండింగ్ ను అందరూ అమితాశ్చర్యంతో చూస్తూనే ఉన్నారు. ప్రాజెక్టు గురించి కంట్రోల్ రూంలో ఉన్న డా. మోహన్ సైంటిస్టులకు ఘట్టానికో అప్ డేట్ ఇవ్వడంతో మరింత ఉత్సుకత కనిపించింది.
పారాచూట్ తో రెడీ అయినప్పటి నుంచి కిందకు దిగిన విషయం వరకూ కన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. భారత సంతతికి చెందిన ఆమె.. సంవత్సరం వయస్సుండగానే ఇండియా నుంచి అమెరికాకు వెళ్లారు. 9ఏళ్ల వయస్సులో స్టార్ ట్రెక్ చూసిన.. అప్పుడే దాని గురించి తెలుసుకుని.. ప్రపంచపంలోని అందమైన ప్రదేశాలకు వెళ్లాలని ఫిక్స్ అయిపోయారట.
The parachute has been deployed! @NASAPersevere is on her way to complete her #CountdownToMars: pic.twitter.com/i29Wb4rYlo
— NASA (@NASA) February 18, 2021
అంగారకుడిపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లను తెలుసుకునేందుకు నాసా 7 నెలల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అప్పుడు ప్రయోగించిన ఈ మార్స్ రోవర్ శుక్రవారానికి కక్ష్యలో ప్రయాణించి లక్ష్యానికి చేరువైందని.. చివరి 7 నిమిషాల గండాన్ని సైతం సక్సెస్‌ఫుల్‌గా అధిగమించందని నాసా కన్ఫామ్ చేసింది.
అంగారకుడిపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లు, అక్కడి వాతావరణం గురించి తెలుసుకునేందుకు నాసా రోబో మార్స్ రోవర్‌ను ప్రయోగించింది. ఈ రోవర్ అంగారక గ్రహంలోని జెజెరో క్రేటర్ అనే ప్రదేశంలో సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయి అంతరిక్ష నౌక నుంచి విడిపోయింది. ఈ ప్రయోగానికి నాసా 2.4 బిలియన్ డాలర్లు (దాదాపు 17వేల కోట్లు) ఖర్చు చేసింది. దీంతోపాటు SUV సైజులో ఉండే Perseverance అనే రోబోను కూడా అంగారక గ్రహం మీదకు పంపింది.
ప్రస్తుతం ఆ ఫొటోలను, వీడియోలను నాసా రిలీజ్ చేసింది. పెర్సర్వరెన్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిన అనంతరం నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ స్టీవ్ జుర్జిక్ టీంను అభినందించి 2020 జూలై 30న ప్రారంభమైన మార్స్ రోవర్ ప్రయాణం విజయవంతమైందని వెల్లడించారు.