కళ్లు పెద్దవిగా చేస్తూ..పళ్లు కొరికిన మెలానియా ట్రంప్..వీడియో వైరల్

  • Publish Date - August 29, 2020 / 11:45 AM IST

అమెరికా అధ్యక్ష పీఠం మరోసారి కూర్చొవాలని చూస్తున్న ట్రంప్..సతీమణి మెలానియా ట్రంప్ కళ్లు పెద్దవిగా చేశారు. పళ్లు కొరుకుతూ కనిపించిన మెలానియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇలా ఎందుకు ఆమె రియాక్షన్ ఇచ్చారనే దానికి కారణం ఉంది.



ట్రంప్ దంపతులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఇవాంక ట్రంప్ పాల్గొనడం..ఎదురుగా ఉండడంతో మెలానియా ఆ విధంగా రియాక్షన్ ఇచ్చారు.

https://10tv.in/vasanthakumar-kanyakumari-mp-dies-of-covid-19/

రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లాస్ట్ డే సమావేశం నిర్వహిస్తున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, నామినేషన్ ను అధికారికంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇవాంక ట్రంప్ కూడా పాల్గొన్నారు. ఇవాంక ట్రంప్ వేదిక మీదకు వచ్చే సందర్భంలో అక్కడ డొనాల్డ్ ట్రంప్, మెలానియా కూడా ఉన్నారు. ఇవాంక ట్రంప్ నవ్వుతూ..విష్ చేశారు.



మెలానియా..చిరునవ్వు చిందించేందుకు ప్రయత్నించారు. కానీ..ఆమె చూపిన హావభావాలు వీడియోలో దర్శనమిచ్చాయి. కళ్లు పెద్దవిగా చేసి..పళ్లు కొరికనట్లుగా కనిపించింది. కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గంటల వ్యవధిలోనే 7.5 మిలియన్ల మంది వ్యూస్ వచ్చాయి. ఆమె వేసుకున్న డ్రెస్ నచ్చలేదోమో..అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.