Meta : ఉద్యోగులకు మెటా వార్నింగ్, మూడు రోజులు ఆఫీసుకు రాకపోతే ఉద్యోగం నుంచి ఊస్టింగ్

ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు..ఆఫీసుకు వచ్చి పనిచేయండి..టీమ్ తో కలిసి మెలిసి పనిచేయండి అంటూ మెటా తమ ఉద్యోగులకు సూచించింది. ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసుకు వచ్చి తీరాల్సిందేనని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Meta Warning To employees

Meta warning to employees : వర్క్ ఫ్రమ్ హోమే బాగుందంటే చాలామంది ఉద్యోగులు ఆఫీసులకు రావటానికి ఇష్టపడటంలేదు. కంపెనీ యాజమాన్యాలు పదే పదే వార్నింగ్ లు ఇస్తున్నా పట్టించుకోవటం లేదు. కనీసం వారానికి ఒకటి రెండు రోజులు ఆఫీసుకు రావాలని సూచించినా పట్టించుకోవటంలేదు. అదే పరిస్థితి మెటా సంస్థ ఉద్యోగులు కూడా అవలంభిస్తున్నారు. ఇంటినుంచే వర్క్ చేస్తున్నారు.

దీంతో మెటా (Meta) ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వచ్చి తీరాలని లేకుంటే పర్మినెంట్ గా ఇంటి వద్దే ఉండిపోవచ్చని వార్నింగ్ ఇచ్చింది. పర్మినెంట్ గా ఇంటి వద్దే ఉండిపోవచ్చు అంటే పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అని అర్థం కాదు. ఆఫీసుకు రాకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తామని వార్నింగ్ ఇచ్చింది మార్క్ జుకెర్ బర్గ్ (CEO Mark Zuckerberg) ఆధ్వర్యంలోని మెటా (ఫేస్ బుక్).

Antique Chair : 130 ఏళ్ల నాటి నిజాం కుర్చీ .. కూర్చుంటే కుర్చీ, మడిస్తే మెట్లు

ప్రతీ వారంలోను కనీసం మూడు రోజులైనా ఆఫీసుకు రావాలని సూచించింది. ఈ నిబంధన ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రతీ మెటా ఉద్యోగికి (Meta employees )వర్తిస్తుందని స్పష్టంచేసింది. కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న నూతన నిబంధనలను పాటించని వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందంటూ సీరియస్ నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 5 నుంచి ఆఫీసులకు కేటాయించిన ఉద్యోగులు వారంలో తప్పనిసరిగా మూడు రోజులు రావాలంటూ హెర్ ఆర్ లోరి గోలర్ (Goler wrote) ఆదేశించారు. ఈ నిర్ణయం తమ ఉద్యోగుల మధ్య మంచి అనుబంధం పెంచటానికి బలమైన టీమ్ వర్క్ కోసం తీసుకున్నామని లోరి గోలర్ స్పష్టంచేశారు.

Crocodiles River : ఓరి నాయనో ఇది మొసళ్ల లోకమా ఏంటీ..? పట్టు తప్పి పడితే ఎముకలు కూడా మిగలవు

సంస్థ ఇచ్చిన ఆదేశాలను పాటించనివారిపై స్థానిక చట్టాల కింద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సంస్థ ఇచ్చిన ఆదేశాలు తమ టీమ్ సభ్యులు పాటిస్తున్నారా? లేదా అనేది మేనేజర్ల బాధ్యతేనని.. ఈ విషయంలో మేనేజర్ల అసత్వం వహిస్తే వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని మెటా స్పష్టంచేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టంచేసింది. ఉద్యోగుల పనితీరు రేటింగ్ తగ్గించడంతోపాటు.. నిబంధనల అతిక్రమణ మితిమీరితే ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు