Mexico Road Accident : మెక్సికోలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 19మంది మృతి

ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్రన్ సినాలోవా రాష్ట్రంలో బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా..

Road Accident

Mexico : ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్రన్ సినాలోవా రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా.. మరో 18మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 37మంది ప్రయాణిస్తున్నారు. మజాట్లాన్, లాస్ మోచిస్ నగరాల మధ్య కోస్టల్ హైవేపై ప్రయాణిస్తున్నక్రమంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం తరువాత హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Also Read : Road accident : మిర్యాల‌గూడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు చిన్నారులు స‌హా ఐదుగురు దుర్మ‌ర‌ణం

బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీకున్నవెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు మంటల్లో పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. తరచుగా ఇటువంటి ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. వేగం, డ్రైవర్ అలసత్వం కారణంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది జూలైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 29మంది ప్రాణాలు కోల్పోయారు.