Middle East Conflict : యుద్ధంలోకి మరో దేశం.. వరల్డ్ వార్ లోడింగ్?

Middle East Conflict : పశ్చిమాసియా సంక్షోభం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది.

Middle East Conflict

Middle East Conflict : పశ్చిమాసియా సంక్షోభం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో అన్ని రకాల వాణిజ్య, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.

Also Read : Imran Khan Hospital : ఇమ్రాన్‌ ఖాన్‌కు ఏమైంది? ఆయన్ను తక్షణమే ఆస్పత్రికి తరలించండి.. పాక్‌ సుప్రీంకోర్టు ఆదేశాలు

యూఏఈ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారని ఎమిరేట్స్ ఆరోపించింది. వాటిలో ఒకటి యూఏఈ జలాల వెలుపల సముద్రంలో పడగా, మరొకటి దేశ జలాల్లో పడినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఈ వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలని, ఇలాంటి ప్రకటనలు ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలిగిస్తాయని ఇరాన్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అయితే, తాజా పరిణామం ఇరాన్-యూఏఈ మధ్య ఇప్పటికే సున్నితంగా ఉన్న సంబంధాలను మరింత దెబ్బతీసింది. గతంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలను కొనసాగించే ప్రయత్నాలు జరిగినప్పటికీ.. తాజా పరిణామాలతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది.

ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం?
యూఏఈ- ఇరాన్ వాణిజ్య సంబంధాల నిలిపివేత, హర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు కీలకంగా మారాయి. ఈ జలమార్గంలో రవాణా అంతరాయం కొనసాగితే చమురు సరఫరా, షిప్పింగ్, బీమా, రవాణా ఖర్చులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ మార్కెట్లలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తూ యూఏఈ తీసుకున్న నిర్ణయం ఇరు దేశాల సంబంధాల్లో మరో పెద్ద మలుపుగా భావిస్తున్నారు.

హర్ముజ్ కేంద్రంగా మళ్లీ ముదురుతున్న వివాదం..
హర్మూజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇప్పటికే ఇరాన్ హెచ్చరిక చేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే వరకు తెరిచే ప్రసక్తే లేదని ప్రకటించింది. యూఏఈ నుంచి గల్ఫ్ వెలుపలికి వెళ్లే నౌకలకు హర్ముజ్ కీలక మార్గం కావడంతో.. ఇరాన్ తాజా ప్రకటన యూఏఈ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ చమురు రవాణాపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి ఒకవైపు క్షిపణి ఆరోపణలు, మరోవైపు వాణిజ్య ఆంక్షలు, ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్ముజ్ పై ఆధిపత్యం తమదేనంటూ ఓ మ్యాప్ రిలీజ్ చేసిన నేపథ్యంలో హర్ముజ్ జలసంధి చుట్టూ పరిణామాలు తదుపరి రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.