Mike Tyson Malawi Asks Former Boxer To Be Cannabis Ambassador
Malawi cannabis ambassador : మాజీ బాక్సర్ మైక్ టైసన్‌కు ఆఫ్రికాలోని మాలావీ దేశం నుంచి ఒక చిత్రమైన అభ్యర్థన వచ్చింది. తమ దేశీయ పంట గంజాయికి అధికారిక అంబాసిడర్ కావాలంట.. ఈ మేరకు ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి లోబిన్ లో (Lobin Low) టైసన్‌కు లేఖ రాశారు. మాలావీలో గంజాయి సాగుకు జాతీయంగా గుర్తింపు ఉంది. గంజాయి పంట సాగుకు మరింత గుర్తింపు కోసం ఒక అంబాసిడర్ కోసం చూస్తోంది. దీనికి మైక్ టైసన్ అయితే బాగుంటుందని ఆ దేశ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే మంత్రి లోబిన్ లో.. టైసన్ కు లేఖ రాశారు. గంజాయికి చట్టబద్ధత తీసుకురావడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించేందుకు అంబాసిడర్ గా ఉండాలని ఆయన లేఖలో కోరారు.
టైసన్.. ప్రపంచపు మాజీ హెవీవెయిట్ ఛాంపియన్.. ఆయన ఒక పారిశామ్రికవేత్త కూడా.. అమెరికాలో గంజాయి సాగుకు పెట్టుబడి కూడా పెట్టాడు. అందుకే తమ దేశంలో గంజాయికి తన మద్దతు కావాలని టైసన్‌ను మంత్రి కోరారు. అయితే.. మాజీ బాక్సర్ 1992లో ఇండియానాలో లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు పాలయ్యాడు. మూడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష అనుభవించిన తర్వాత 1995లో టైసన్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో మైక్ టైసన్‌పై కొందరి నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టైసన్ అంబాసిడర్ నియామక నిర్ణయంపై విమర్శకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.
‘ఈ గంజాయి పరిశ్రమ అనేది క్లిష్టమైనది.. అందుకే మాలావీ ప్రభుత్వం నేరుగా అందులోకి దిగడం లేదు. అందువల్ల మిస్టర్ మైక్ టైసన్‌ని గంజాయి బ్రాంచ్ అంబాసిడర్‌గా నియమించాలనుకుంటోంది’ అని మంత్రి లోవ్ లేఖలో రాసుకొచ్చారు. యునైటెడ్ స్టేట్స్ గంజాయి సంఘం టైసన్‌తో ఈ ఒప్పందాన్ని సులభతరం చేస్తోందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. మాజీ బాక్సర్ ఆహ్వానాన్ని అంగీకరించారని, త్వరలో టైసన్ తమ దేశాన్ని విజిట్ చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని మాలావీ వ్యవసాయ శాఖ అధిపతి Wezi Ngalamila పేర్కొన్నారు.
గత ఏడాదిలోనే ఔషధ వినియోగం కోసం గంజాయిని పెంచడం, ప్రాసెసింగ్ చేయడం చట్టబద్ధం చేసింది మాలావీ. కానీ, వ్యక్తిగత ఉపయోగానికి మాత్రం చట్టబద్ధం చేయలేదు. దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులను ఔషధ ప్రయోజనాల కోసం గంజాయిని సాగు చేయాలని అలాగే పారిశ్రామిక అవసరాల కోసం జనపనారను పండించమని ప్రోత్సహించింది. దీనికి టైసన్ అంబాసిడర్‌గా ఉంటే.. కొంతమంది ఇన్వెస్టర్లను ఆకర్షించడం సాధ్యపడుతుందని మాలావీ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు టైసన్.. గంజాయిని స్మోకింగ్ చేయడం ద్వారా తన మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. అలాగే తన జీవితానికి టర్నింగ్ పాయింట్ గా మారిందన్నాడు. కానీ, గంజాయిని స్మోకింగ్ చేయడం ద్వారా తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురయ్యే ముప్పు ఉందని పలు అధ్యయనాలు సూచించాయి.
Read Also : Ghost Marriages: 3,000 ఏళ్లుగా దెయ్యానికి పెళ్లి చేసే ఆచారం..! ఆన్ లైన్ లో ఇదో వ్యాపారం..!!