Money Heist Acter Ganesh : మనీ హైస్ట్ నటి ఇంట్లో మన గణపయ్య ఫోటో..
మనీ హైస్ట్ నటి ఇంట్లో మన గణపయ్య ఫోటో ఉంది. మనీ హైస్ట్ నటి ఎస్తేర్ తన ట్విట్టర్ లో పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- nagamani
- Published On : January 6, 2022 / 06:54 PM IST
Money Heist Acter Ganesh Photo
Vinayaka Photo In Money Heist Actress house : నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన మనీ హైస్ట్. వెబ్ సిరీస్ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. స్పానిష్ కి చెందిన ఈ వెబ్ సిరీస్ ఎన్నో భాషలలో విడుదలై సంచలన క్రియేట్ చేస్తోంది. ఎన్ని సిరీస్ లు వచ్చినా ఆ క్రేజ్ మాత్రం తగ్గటంలేదు. ఈ సిరీస్ తెలుగు భాషలో కూడా విడుదల చక్కటి క్రేజ్ ను క్రియేట్ చేస్తోంది. ఈ సిరీస్ లో ఏ ప్రాత్రకు ఆ పాత్రే కీలకం అన్నట్లుగా ఉంటుంది. ప్రతీ పాత్ర ఆకట్టుకునేలానే ఉంది. ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందులో స్టాక్ హోమ్ అనే పాత్ర మొదట్లో చాలా ఇన్నోసెంట్ గా అనిపించింది. మొదట్లో అమాయకపు ప్రియురాలిగా..తరువాత తన ప్రాణాలు..తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలు దక్కించుకోవటానికి రాబరీకి వచ్చినవారిలో ఓ పాత్రతో ప్రేమలోపడుతుంది. ఈ సిరిస్ సుఖాంతమై..వారి రాబరీ దిగ్విజయంగా ముగిసి ఎవరి వాటాలు వారు పంచుకుని వెళ్లిపోయాక అతనినే వివాహం చేసుకుని ఓబిడ్డకు జన్మనిస్తుంది.
Read more : Squid Games Protest : ఉద్యోగ భద్రత కల్పించండి..”స్విడ్ గేమ్స్”వర్కర్స్ ఆందోళన
అదే రెండో సిరిస్ కు వచ్చేసరికి ఆమెలో ఉండే అమాయకత్వం పోయి ఓ తెగువ కనిపిస్తుంది. ఓ తల్లిగా..అలాగే ధైర్యసాహసాలు కలిగిన ధీరగా అనిపించింది. ఇలా ఈమె పాత్ర గురించి చెప్పుకుంటు పోతే చాలానే చెప్పుకోవచ్చు. ఇక ఈ పాత్ర గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిదంటే..ఆ పాత్ర పోషించిన నటి పేరు ఎస్తర్ ఎసిబో. ఇక ఈమె స్పానిష్ కి చెందిన నటి.ఇ క ఈ నటి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఆమె గురించి చెప్పుకోవటానికి ఓ ముఖ్యమైన కారణముంది.
Read more : Breastfeeding: పాలిస్తుండగా తల్లులను ఫొటో తీస్తే జైలుకే
ఎస్తేర్ తన ట్విట్టర్ లో పోస్టు చేసిన ఓ ఫోటోనే ఆమె గురించి చెప్పుకోవటానికి కారణమైంది. అదేమంటే..ఆమె ఇంట్లో మన వినాయకుడి ఫోటో ఉంది. ఆమె వెనుకాల హిందువులు పూజించే గణపయ్య చిత్రపటం ఉంది.ఇక ఎస్తర్ షేర్ చేసిన వీడియోలో గణపయ్య చిత్రం కనిపించడంతో దానిని స్క్రీన్ షాట్ తీసి ది అన్ స్టాపబుల్ వింగ్స్ అనే ఓ సంస్థ ఆ స్క్రీన్ షాట్ ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అంతేకాకుండా ఈ విషయాన్ని గర్వంగా ఫీల్ అవ్వాలి అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో స్పానిష్ నటి ఇంట్లో గణపయ్య అంటూ నెటిజన్లు లైకులు ఇస్తు..షేర్ చేస్తు వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా మన సాంప్రదాయాన్ని గౌరవిస్తునందుకు ఆమెను తెగ మెచ్చేసుకుంటున్నారు. ఎంతైనా స్పానిష్ లో గణపయ్య చిత్రపటం ఉండటం విశేషమే కదామరి..
