Breastfeeding: పాలిస్తుండగా తల్లులను ఫొటో తీస్తే జైలుకే

పాలిస్తున్న తల్లులను వారి అనుమతి లేకుండా ఫొటోలు తీస్తే శిక్షార్హులనే ప్రతిపాదన బ్రిటీష్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అలా చేస్తే రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని అందులో....

Breastfeeding: పాలిస్తుండగా తల్లులను ఫొటో తీస్తే జైలుకే

Breast Feeding

Breastfeeding: పాలిస్తున్న తల్లులను వారి అనుమతి లేకుండా ఫొటోలు తీస్తే శిక్షార్హులనే ప్రతిపాదన బ్రిటీష్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అలా చేస్తే రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని అందులో పేర్కొన్నారు. పోలీసు, నేరం, శిక్షలు, కోర్టుల బిల్లుల సవరణలో భాగంగా న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను చేర్చింది.

ఎంపీ వాల్తమ్‌స్టో తన నాలుగు నెలల కూతురికి ట్రైన్ లో కూర్చొని పాలిస్తుండగా ఎవరో ఫొటో తీశారు. దీనిపై స్టెల్లా క్రీసి అనే న్యాయవాది సుదీర్ఘ పోరాటం చేస్తూ.. చట్టం చేయాలని గొంతెత్తారు. ఈ విషయం పార్లమెంట్ వరకూ చేరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

‘మనం చేయగలిగాం. ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ. ఇక Breastpests ప్రచారాన్ని ఆపేయండి. ఇవాళ సభలో దీనిని ప్రవేశపెట్టాం. వారి వ్యక్తిగత అనుమతి లేకుండా ఫొటో గానీ, వీడియో గానీ తీయడం చట్ట రీత్యా నేరం. ప్రత్యేకించి ఈ కాంపైన్ ఆరంభించిన వారికి థ్యాంక్స్ చెబుతున్నా’ అంటూ అందులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : ఆరోగ్యానికి మేలు చేసే పైనాపిల్