Pineapple : ఆరోగ్యానికి మేలు చేసే పైనాపిల్

పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది. ఇందులోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ వంటి వ్యాధులనుండి ఉపశమనం కలిగిస్తుంది.

Pineapple : ఆరోగ్యానికి మేలు చేసే పైనాపిల్

Pineapple

Pineapple : పుల్లగా, తియ్యగా ఉండే పైనాపిల్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని ఆహారంగా తీసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అధికమొత్తంలో నీరు ఉంటుంది. విటమిన్స్ తోపాటు అనేక ఇతర పోషకాలు పైనాపిల్ లో ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు, దంత సమస్యల నివారణలో ఇది ఔషదంగా ఉపకరిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది.

100గ్రాముల పైనాపిల్‌లో నీరు 87.8 గ్రాములు , ప్రొటీన్ 0.4 మి.గ్రా, కొవ్వు 0.1 మి.గ్రా, పిండి పదార్థం 10.8 మి.గ్రా, కాల్షియం 20 మి.గ్రా, పాస్పరస్ 9 మి.గ్రా, ఐరన్ 2.4 మి.గ్రా, సోడియం 34.7 మి.గ్రా, పొటాషియం 37 మి.గ్రా, మాంగనీస్ 0.56 మి.గ్రా, కెరోటిన్ 18 మైక్రోగ్రాములు, శక్తి 46 కిలో కాలరీలు ఉంటాయి.

ప్రతిరోజూ మీరు తీసుకునే ఫ్రూట్ సలాడ్‌లో 50 గ్రాములు పైనాపిల్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.

పైనాపిల్‌లో అమినో యాసిడ్ ట్రైపోటాన్ రిచ్‌గా ఉండటం వల్ల హార్మోన్‌ల ఆరోగ్యానికి మంచిది. న్యూరోలాజిక్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి పైనాపిల్‌లో ఉండే పోషకాలు ఉపయోగపడతాయి. పైనాపిల్ ను తీసుకోవటం వల్ల మనస్సు ప్రశాంతత కలుగుతుంది. పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం అందంగా మారుతుంది.

ఇందులో ఉండే ఎంజైములు చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది. పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చనిపోతాయి. జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యంతో ఉన్న వారికి పైనాపిల్ రసం ఇవ్వడం వల్ల త్వరగా కోలుకుంటారు.

పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం కాకుండా ఆగిపోతుంది. ఇందులోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ వంటి వ్యాధులనుండి ఉపశమనం కలిగిస్తుంది. పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచిది.

మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది. పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల.. కంటి సమస్యలు దరిచేరవు. ఇందులో బీటా కెరోటిన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కంటిచూపు మెరుగవుతుంది. బరువు తగ్గించటంలో పైనాపిల్ బాగా ఉపకరిస్తుంది. కొవ్వును కరిగించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ఇందులో కేలరీలు తక్కవ మోతాదులో ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆహారం జీర్ణమయ్యేలా చేయటంలో దోహదపడుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే మాంగనీస్, కాల్షియం ఎముకలు బలంగా తయారవ్వటానికి సహాయపడతాయి. పైనాపిల్ లో యాంటీ క్యాన్సర్ ఏజెంట్ లు సమృద్ధిగా ఉంటాయి. అప్పుడప్పుడు పూనాపిల్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ దరిచేరదు.