శ్రీలంకలో మళ్లీ ఉగ్రదాడులు : అమెరికా హెచ్చరిక

  • Publish Date - April 26, 2019 / 04:10 AM IST

శ్రీలంక రావణకాష్టంలా రగులుతోంది. ఇప్పటికే వరుస  బాంబు దాడులతో అల్లాడిపోతోంది. ఇంకా ఆ షాక్ నుండి కోలుకోనేలేదు. ఈ క్రమంలో శ్రీలంక అమెరికా చేసిన హెచ్చరికతో మరోసారి ఉలిక్కిపడింది. ఈస్టర్ పండుగ రోజున ఉగ్రదాడులతో ఐసిస్ విరుచుకుపడిన ఘటనల్లో 359 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. 
Also Read : మోడీ చాపర్ చెక్ చేసిన IAS సస్పెండ్…స్టే విధించిన క్యాట్

ఈ క్రమంలో దేశంలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని అమెరికా రాయబార కార్యాలయం శ్రీలంకకు సమాచారమిచ్చింది. మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ వారంలో అంటే ఏప్రిల్ 26 నుంచి 28వతేదీ ఆదివారం లోగా కొలోంబోలోని ప్రార్థనాస్థలాలకు ప్రజలు వెళ్లవద్దని అమెరికా రాయబార కార్యాలయ అధికారులు ట్విట్టర్ లో హెచ్చరించారు.

ఈ దాడులు ప్రార్థనాలయాలపై జరగవచ్చని అమెరికా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో శ్రీలంక పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. దీంతో అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేసి క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో  దేశంలో పోలీసు బందోబస్తును పెంచడంతోపాటు అనుమానితులను అరెస్ట్ చేయటం కొనసాగుతోంది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ్ సింఘే తెలిపారు.