Viral Video : గుడ్లు పెడుతున్న దోమ వీడియో..ఇంట్రెస్టింగ్ వీడియో
దోమ గుడ్లు పెట్టటం మీరు ఎప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో చూడండీ..
- nagamani
- Published On : October 8, 2021 / 04:29 PM IST
Mosquitoe Who Lays Eggs
mosquitoes who lays eggs : సోషల్ మీడియాలో ఎన్నో ఇట్రెస్టింగ్, షాకింగ్, ఫ్రాంక్, హర్రర్ వీడియోలు చూసే ఉంటాం. బహుశా ఇటువంటి వీడియో చూసి ఉండరు. సోషల్ మీడియాలో దోమకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దోమ గుడ్లు పెట్టడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దోమే అయినా ఎంత పర్ఫెక్ట్ గా వరుస తప్పకుండా టకాటకా గుడ్లు ఎలా పెట్టేస్తోందో అంటున్నారు. చాలా మంది అయితే దోమ గుడ్లు పెట్టటం మేం ఎప్పుడు చూడలేదు. భలే ఉంది ఎవరి తీసారోగానీ అంటున్నారు.
దోమలంటేనే చిరాకుకంటే భయమే ఎక్కువ. ఏదోమ కుడితే ఏ వ్యాధి వస్తుందోనని.అందుకే దోమలు దరి చేరకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. దోమల నివారణలో ప్రధాన అస్త్రం.. అవి పెట్టే గుడ్లే. దోమల్ని నివారించాలంటే దోమల గుడ్లను ధ్వంసం చేయాలి. ఎక్కడ మురుగునీరు కనిపిస్తే అక్కడ దోమలు చేరిపోతాయి. గుడ్లు పెట్టేస్తాయి. లక్షలాది మిలియన్ల కోట్ల దోమల్ని సృష్టిస్తాయి.మరి దోమ గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా? అంటే చూడలేదని చెబుతాం. అయితే ఈ వీడియో చూస్తే దోమ గుడ్లు ఎంత పర్ఫెక్ట్ గా పెడుతుంతో చూస్తే ఆశ్చర్యపోతాం. దోమ గుడ్లు పెడుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఆడ దోమ ఒకేసారి 200 నుంచి 500 గుడ్లుపైగా పెట్టింది. ఆ గుడ్లన్నింటినీ ఒక వరుస క్రమంలో నిటారుగా నిలబడేలా పెట్టడం నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది. గుడ్లు దెబ్బతినకుండా, దోమ పిల్లలు సరైన సమయంలో బయటకు వచ్చేలా గుడ్లను ఏర్పాటు చేసింది.
Read more : PM Pedro Sánchez : తల్లిదండ్రులపై ఆధారపడే యువతకు నెలకు రూ.25వేలు ప్రభుత్వం సహాయం
ఈ సందర్భంగా దోమ గురించి కొన్ని వివరాలు కూడా చెప్పుకుందాం. ఒక ఆడ దోమ జీవితం కాలం 40-50 రోజులు. మగ దోమ జీవిత కాలం 10 రోజులు మాత్రమే. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.. ఆడ దోమ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే లైంగిక సంపర్కం జరుపుతుంది. ఆ ఒక్కసారికే 200 నుంచి 500 గుడ్లు పెడుతుంది. అలా గుడ్లు పెడుతున్న ఓ ఆడదోమ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి మీరు కూడా ఓ లుక్ వేయిండీ ఈ గుడ్ల సీన్ వైపు..
This mosquito laying eggs.#TiredEarth pic.twitter.com/TVxorCe29N
— Rebecca Herbert (@RebeccaH2030) September 22, 2021
