PM Pedro Sánchez : తల్లిదండ్రులపై ఆధారపడే యువతకు నెలకు రూ.25వేలు ప్రభుత్వం సహాయం

తల్లిదండ్రులపై ఆధారపడి జీవించే యువతకు సహాయం చేయాలని స్పెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. 18 నుంచి 25 ఏళ్లవారికి నెలకు 292 యూరోలు ఇస్తామని ప్రధాని ప్రకటించారు.

PM Pedro Sánchez : తల్లిదండ్రులపై ఆధారపడే యువతకు నెలకు రూ.25వేలు ప్రభుత్వం సహాయం

To Pay Rs 55000 Fine Cockroach Customer Jamun (1)

Spain PM Pedro Sánchez : తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తారు. వారికి ఉద్యోగం వస్తే సంతోషిస్తారు.కానీ చదువు పూర్తి అయినా ఉద్యోగం రాకపోతే అది అటువంటి యువతకు దిగులు. ఇటు తల్లిదండ్రులకు భారం. దీంతో పిల్లలకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులు వారికి అండగా ఉంటారు. అదే ఏ మధ్యతరగతివారో..పేదలో అయితే తల్లిదండ్రులకు పిల్లలు భారంగానే మారతారు.దీంతో సదరు యువత తల్లిదండ్రులకు భారంగా మారుతున్నామనే బాధపడుతుంటారు. కానీ ఇకనుంచి అటువంటి బాధ అవసరం లేదంటోందో స్పెయిర్ ప్రభుత్వం. తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించే యువతకు నెలకు 250 పౌండ్లు సహాయంగా ఇస్తామని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాన్‌షెజ్‌ స్వయంగా ప్రకటించారు. నాలుగున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న స్పెయిన్‌ ఇటువంటి కొత్త ఆలోచన చేసి యువతకు తద్వారా తల్లిదండ్రులకు భారం తగ్గించింది.

Read more : No Quarantine: భారత్ దెబ్బకు దిగొచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం.. ఇకపై క్వారంటైన్ అక్కర్లేదు
గత మంగళవారం (అక్టోబర్ 5,2021) ప్రధాని పెడ్రో సాన్‌షెజ్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తు ఈ ప్రకటన చేశారు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా.. దూరంగా బతికే పిల్లలకు నెలకు 290 యూరోలు ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించారు. 18 నుంచి 35 ఏళ్ల వయసులోపువారు పేరెంట్స్‌కు దూరంగా, విడిగా ఉంటే నెలకు 290 యూరోలు (భారత కరెన్సీలో 25 వేల రూపాయలకు పైనే) ఇస్తామని ప్రకటించారు. కానీ కొన్ని కండిషన్‌ కూడా పెట్టారు. అదికూడా చాలా రీజనబుల్ కండిషన్సే కావటం విశేషం.

తల్లిదండ్రులకు దూరంగా ఉండటమే కాకుండా వారు ఏదైనా పని చేసుకుంటూ ఉంటేనే ఈ సహాయం వర్తిస్తుందని తెలిపారు. అంటే పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవం లాంటిది. అంతేకాదు వారు సంవత్సరానికి 23 వేల పౌండ్లు సంపాదించేవారికి ఈ సహాయం వర్తిస్తుందని తెలిపారు. దీంట్లో మరో షరతు కూడా ఉంది. అదేమంటే.. ప్రభుత్వం ఇచ్చే 250 పౌండ్లను వారు ఉండే రూమ్స్ అద్దె కోసమే ఖర్చు చేయాలట. అలా వారికి ఉద్యోగం వచ్చేవరకు మాత్రం ఈ సహాయం అందదు. అదీ రెండేళ్లపాటు మాత్రమే ఇస్తామని స్పెయిన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

Read more : Malaria Vaccine : WHO ఆమోదించిన ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్

కాగా..అన్ని దేశాల్లో వలెనే స్పెయిన్‌లో నిరుద్యోగ సమస్య ఉంది. గత కొన్నేళ్లుగా నిరుద్యోగం శాతం పెరుగుతోంది. దీంతో చదువుకున్నా ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది యువత అయితేఏ పనీచేయకుండా బద్ధకంగా మారిపోతున్నారట. దీంతో 30 దాటిపోయినా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతున్నారు.ఇంకా వివరంగా చెప్పాలంటే సంపాదించే స్తోమత ఉన్నవారు కూడా అద్దెల కట్టే బాధ తప్పించుకోవటానికి వాళ్ల కుటుంబాలతో సహా తల్లిదండ్రుల ఇళ్లలోకి చేరిపోతురట. దీంతో తల్లిదండ్రులకు మరింత భారం తప్పటంలేదు. దీంతో వయస్సు మీదపడుతున్నా పిల్లల కోసం కష్టపడుతున్నారట. కాగా..యూరప్ లో 25 ఏళ్ల నిరుద్యోగ యువత 33 శాతంమంది ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా ప్రపంచ దేశాల్ని వణికించే కరోనా ప్రభావంతో స్పెయిన్ లో కూడా ఎంతోమంది యువత ఉద్యోగాల్ని కోల్పోయారు. ఉద్యోగాలు చేసేవాళ్లు సైతం అద్దెను మిగిల్చుకునేందుకు ఇలా తల్లిదండ్రుల పంచన చేరుతున్న పరిస్థితి నెలికొంది. ఈ పరిస్థితి ఒక్క స్పెయిన్‌లోనేకాదు.. ఇటలీ, గ్రీస్‌ వంటి దేశాల్లో కూడా ఉంది. అందుకే స్పెయిన్‌ ప్రధాని పెడ్రో ‘హౌజింగ్‌ ప్లాన్‌’ రూపొందించి.. ఇలా ఆఫర్ల ద్వారా ఆకట్టుకుని హౌజ్‌ మార్కెటింగ్‌ ఆదాయం పెంచుకునేందుకు, యువతకు పట్టిన బద్ధకాన్ని వదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు.