London : మరణానికి ముందు చాలామంది 5 అంశాల్లో పశ్చాత్తాప పడుతున్నారట

వృద్ధాప్యంలో చాలామందిలో పశ్చాత్తాపం మొదలవుతుంది. తను సాధించిన విజయాలు పక్కన పెడితే తను చేసిన తప్పులు, తనలోని లోపాలు అప్పుడు వారికి అవగతమవుతాయి. ముఖ్యంగా 5 అంశాల్లో చాలామంది రిగ్రెట్ ఫీలవుతారట.

London

London : జీవిత చరమాంకంలో చాలామందిలో ఏదో తెలియని పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇలా ఉండాల్సింది.. అలా చేయాల్సింది అని రిగ్రెట్ ఫీలవుతుంటారు. అయితే చాలామందిలో కనిపించే కొన్ని కామన్ ఫీలింగ్స్  బ్రోనీవేర్ అనే ఆస్ట్రేలియన్ నర్స్ స్టడీ చేసింది. ముఖ్యంగా ఐదు అంశాల్లో తీవ్రమైన పశ్చాత్తాపానికి గురై చాలామంది మరణిస్తున్నారని  బ్రోనీవేర్ తన తన బ్లాగ్‌లో రాసుకుంది.

Death Predictor :ఎప్పుడు చనిపోతామో తెలుసుకోవచ్చట..మరణం గురించి చెప్పే క్యాలుకులేటర్

బ్రోనీవేర్ అనే ఆస్ట్రేలియన్ నర్సు మరణానికి చేరువలో ఉన్న రోగులకు 12 వారాలపాటు సేవలు అందించింది. ఆ సమయంలో వారిలో కలిగిన భావాలను ‘ఇన్స్పిరేషన్ అండ్ చాయ్’ అనే తన బ్లాగ్‌లో రాసుకుంది. ఆ తరువాత వాటిని  ‘ది టాప్ ఫైవ్ రిగ్రెట్స్ ఆఫ్ ది డయింగ్’ అనే పుస్తక రూపంలో అందరి ముందుకు తీసుకువచ్చింది . అయితే ఆ ఐదు ఏంటంటే..

Physical Activity : యువకులు, వృద్ధులు రోజువారిగా ఎంత సమయం రన్నింగ్ చెయ్యొచ్చు ? నిపుణులు ఏంసూచిస్తున్నారంటే ?

1. ఇతరుల నుంచి ఏదీ ఆశించకుండా నా జీవితాన్ని దైర్యంగా జీవించాలని కోరుకున్నాను..2. నేను అంతగా కష్టపడి పనిచేయలేదు అనుకుంటున్నాను.. 3. నా భావాల్ని ధైర్యంగా చెప్పి ఉండాల్సింది అనుకుంటున్నాను.. 4. స్నేహితులతో సన్నిహితంగా ఉండాలని అనుకున్నాను.. 5. నాకు నేను సంతోషంగా ఉండాలని అనుకున్నాను. ముఖ్యంగా ఈ అంశాలలో చాలామంది పశ్చాత్తాపపడినట్లు బ్లాగ్‌లో బ్రోనీ వేర్ రాతల్ని బట్టి తెలుస్తోంది.