కరోనా వైరస్ ప్రపంచపు అంచులను తాకింది. నేపాల్ గవర్నమెంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు నో ఎంట్రీ చెప్పేసింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. టిబెట్ వైపుగా ఎక్కే పర్వతారోహకులను చైనీస్ ప్రభుత్వం ఆపేసింది.
WHO కరోనాను మహమ్మారిగా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ప్రపంచ దేశాలు జాగ్రత్తలు పెంచేశాయి. ఈ క్రమంలోనే ఎవరెస్ట్ ఎక్కకూడదనే ఆంక్షలు పెడుతూ.. ఈ ఆర్డర్స్ వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. ఏప్రిల్ చివరి వరకూ ఇదే షరతులు వర్తిస్తాయి’ అని నేపాల్ టూరిజం సెక్రటరీ కేదర్ బహదూర్ అధికారి చెప్పారు.
ఎవరెస్ట్ ఎక్కడానికి ఇదే కరెక్ట్ సీజన్. ఈ అనుమతులు తీసుకునేందుకు దాదాపు 11వేల డాలర్ల వరకూ ఖర్చు అవుతాయి. అదే సమయంలో కరోనా భయం పొంచి ఉండటంతో నో ఎంట్రీ చెప్పకతప్పలేదు. పర్వతం పైకి ఎక్కే కొలదీ శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. పైగా కరోనాకు గురయ్యామని తెలియకుండానే పర్యటనకు బయల్దేరితే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయి ప్రాణం పోయే ప్రమాదముంది.
గతేడాది 11మంది పర్వతారోహణకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. వాతావరణాన్ని బట్టి పర్వతాలపై ఎక్కేందుకు పర్మిషన్స్ ఇస్తారు.