ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తున్నాం: డబ్ల్యూహెచ్‌వో

సోకితే శరీరంపై నీటితో కూడిన బొబ్బలు ఏర్పడతాయి. జ్వరంతో పాటు కండరాల నొప్పులు కూడా వస్తాయి.

ఎంపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వో ఎంపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. ఈ వ్యాధి రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి పొరుగు దేశాలకు భారీగా వ్యాప్తి చెందుతోంది.

ఎంపాక్స్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు చాలా తేలికగా ఈ వైరస్ సోకుతోంది. ఎంపాక్స్ ని మంకీపాక్స్‌గానూ పిలుస్తారు..  2022లో మంకీపాక్స్‌ పేరును డబ్ల్యూహెచ్‌వో ఎంపాక్స్‌గా మార్చింది. దీన్ని కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో అన్ని దేశాలూ అప్రమత్తమవుతున్నాయి. ఈ ఏడాది ఎంపాక్స్ దాదాపు 14,000 మందికి సోకింది.

ఇది కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో పాటు మిగతా పొరుగు దేశాలకు కూడా వ్యాపించింది. కాంగోలో 450 మంది ఈ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ ప్రతిస్పందన అవసరమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు.

ఎంపాక్స్ సోకితే శరీరంపై నీటితో కూడిన బొబ్బలు ఏర్పడతాయి. జ్వరంతో పాటు కండరాల నొప్పులు కూడా వస్తాయి. ఇంతకుముందే ఆఫ్రికా ఖండం మొత్తం దీనిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. ఈ వైరస్ సోకిన జంతువులు, మనుషుల సాన్నిహిత్యంతో ఇతరులకు కూడా సోకుతుంది. ఎంపాక్స్ బారిన పడ్డ వారితో శృంగారంలో పాల్గొనడంతో పాటు వారిని తాకడం, వారి వద్దకు వెళ్లి మాట్లాడటం వల్ల సోకుతుంది.

Also Read: భార్య అందంగా త‌యార‌వుతోంద‌ని.. న‌లుగురు స్నేహితుల‌తో క‌లిసి భ‌ర్త దారుణం..

ట్రెండింగ్ వార్తలు