Mrs World Arrested : మిసెస్ శ్రీలంక పోటీల్లో గందరగోళం సృష్టించిన మిసెస్‌ వరల్డ్‌ అరెస్ట్

Mrs World Carolina Jury Arrested in srilanka : శ్రీలంక రాజధాని కొలంబోలో ఇటీవల జరిగిన మిసెస్‌ శ్రీలంక 2020 పోటీల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మిసెస్ శ్రీలంకగా ఎన్నికైన మహిళ తలపై కిరీటాన్ని తీసివేసి అమెపై ఆరోపణలు చేసి..న్యాయనిర్ణేతలు ప్రకటించిన మహిళను కాకుండా రన్నరప్‌కు కిరీటం తొడిగి 2019లో మిసెస్‌ శ్రీలంకగా నిలిచిన కరోలినా జ్యూరీ నానా హంగామా సృష్టించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేజీ మీదనే మిసెస్ శ్రీలంకను అవమానించి గందరగోళం సృష్టించిన మిసెస్ శ్రీలంక కరోలినా జ్యూరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కరోలినా తనకు తానే పరువు తీసుకున్నట్లైంది.

 

కోలంబోలో మిసెస్‌ శ్రీలంక పోటీలు జరిగాయి. న్యాయనిర్ణేతలు పుష్పికా డీ సిల్వా అనే మహిళ విజేతగా ప్రకటించారు. ఆమెకు మిసెస్ వరల్డ్, మాజీ మిసెస్ శ్రీలంక అయిన కరోలినాయే కిరీటం కూడా తొడిగారు. కానీ, ఆ తరువాత 2019, మిసెస్‌ శ్రీలంక కరోలినా జ్యూరీ మాట్లాడుతూ..పుష్పిక ఈ కిరీటాన్ని ధరించటానికి ఆమె అర్హురాలు కాదనీ..ఆమె విడాకులు తీసుకుందనీ..మిసెస్ శ్రీలంక విజేతగా ఆమె ఈ కిరీటాన్ని ధరించటానికి అర్హురాలు కాదంటూ..ఆమె తలమీద నుంచి లాగేసి..రన్నరప్‌గా నిలిచిన మరో మహిళ తలపై పెట్టి అనూహ్యంగా ప్రవర్తించారు. ఈ అనూహ్య పరిణామం తరువాత పుష్పికా డిసెల్వా స్టేజ్ నుంచి కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయారు. 2019లో మిసెస్‌ శ్రీలంక అయిన కరోలినా జ్యూరీ 2020లో మిసెస్‌ వరల్డ్‌గా ఎంపికవడం గమనార్హం.

దీనిపై స్పందించిన పుష్పిక తాను విడాకులు తీసుకోలేదనీ కేవలం తన భర్తకు దూరంగా ఉంటున్నాననీ స్పష్టంచేశారు. కరోలీనాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ నాపై నిందలు వేసిన వారు ఈ విషయాన్ని నిరూపించాలంటే నా విడాకుల పత్రాలు అందరికీ చూపించాలి’’ అంటూ సవాల్‌ విసిరారు. అలాగే న్యాయ నిర్ణేతలు కూడా పుష్పికనే విజేత అని ఆమె కిరీటం ఆమెకు ఇచ్చేస్తామని ఇటువంటి పరిణామం జరగటం దురదృష్టకరమని తెలిపారు.

ఈ ఘటనపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు జ్యూరీతో పాటు ఆమెకు సహకరించిన ఆమె సహచరి చులా మనమేంద్ర అనే మరో మోడల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. న్యాయనిర్ణేతలు మాత్రం పుష్పికనే విజేతగా తేల్చారు. తనను స్టేజీ మీద అంతగా అవమానించిన కరోలినా తనకు బహిరంగ క్షమాపణ కోరితే కేసు వాపస్‌ తీసుకుంటానని పుష్పిక స్పష్టంచేసారు. కానీ తాను చేసింది మాత్రం కరెక్టేననీ క్షమాపణ చెప్పేదే లేదనీ కరోలినా తేల్చి చెప్పారు. ఇలా ఇరువురు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

ట్రెండింగ్ వార్తలు