Mukesh Ambani’s new most EXPENSIVE bulletproof car:
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు.. ప్రపంచంలోనే ఏడో ధనవంతుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు.. బిలయనీర్‌గా అంబానీతో సహా ఆయన కుటుంబానికి సెక్యూరిటీ కావాలి.
ఒంటరిగా బైటకు వెళ్లలేరు. అందుకే ముఖేశ్ అంబానీ సహా ఆయన కుటుంబం రక్షణకి Z+ కేటగిరీ భద్రత ఎప్పుడూ వెంట ఉంటుంది. ముఖేష్ ఎక్కడికి వెళ్లినా ఆయన తన బుల్లెట్ ఫ్రూప్ కార్లలో మాత్రమే వెళ్తుంటారు.
ప్రస్తుతం ఆయన వాడుతున్న ఫ్లీట్‌లో BMW 7-సిరీస్ హైసెక్యూరిటీ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ గార్డ్ ఉన్నాయి. ఇప్పుడు మరో ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు.. అదే.. Mercedes S600 Guard. టాప్ ఆర్మడ్ కార్లలో టాప్ బుల్లెట్ ప్రూఫ్ కారు ఇది..
ఆయన కాస్ట్లీ హోం యాంటిలియా బైట ఈ కారు దర్శనమిచ్చింది. కారు త్వరలో అంబానీ కాన్వాయ్‌లోకి చేరనుంది.. ఈ బుల్లెట్‌ప్రూఫ్ లగ్జరీ సెలూన్ ఖచ్చితమైన ధర ఎంతో తెలియదు.. దీని ధర కనీసం రూ .10 కోట్లు ఉంటుందని అంచనా.
W222 మెర్సిడెస్ ఎస్ 600 గార్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించారు. చూడటానికి మామూలు బెంజ్‌లాగే కనిపిస్తుంది.. కాని ఫుల్లీ బుల్లెట్ ప్రూఫ్. Mercedes-Maybach S600 sedan ఆర్మడ్ వెర్షన్ VR10 లెవల్ సెక్యూరిటీతో వస్తుంది. ఇది ప్రపంచంలో మొట్ట మొదటి సివిల్ వెహికల్‌గా నిలిచింది.
ఈ కారుపై గురిపెట్టి కాల్చినా స్టీల్ కోర్ బుల్లెట్లను తట్టుకోగలదు. 2 మీటర్ల దూరం నుంచి 15 కిలోల TNT పేలుడు కూడా తట్టుకోగల సామర్థ్యం దీని సొంతం. reinforced బేస్ స్ట్రక్చర్ పాలికార్బోనేట్-కోటెడ్ విండోస్‌తో కూడిన ప్రత్యేక అండర్ బాడీ షీల్డ్ సహా ఫీచర్లు ఉన్నాయి.. ఈ కారు బాడీ షెల్ reinforced స్టీల్‌తో తయారైంది..
అలాగే.. భారీ 6.0-లీటర్ V12, bi-turbocharged పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. 523 Bhp, 850 Nm of torque డెవలప్ చేశారు. ఏడు-స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్మిషన్. కొన్ని నెలల క్రితం, రూ. 13 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII కారు అంబానీ గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన కారు రోడ్లపై తిరిగింది.