Mysterious Pneumonia : చైనాలో మిస్టరీగా మారిన మరో మహమ్మారి న్యుమోనియా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

చైనా దేశంలో మరో కరోనా లాగా మరో మహమ్మారి న్యుమోనియా మిస్టరీగా మారిందా? అంటే అవునంటున్నాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులు. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న కొవిడ్ చైనా దేశం నుంచి వ్యాప్తి చెందింది. ఈ సారి పిల్లల్లో శ్వాసకోశ సమస్యలతో కొత్త మహమ్మారి ప్రబలుతోంది.....

Mysterious Pneumonia

Mysterious Pneumonia : చైనా దేశంలో మరో కరోనా లాగా మరో మహమ్మారి న్యుమోనియా మిస్టరీగా మారిందా? అంటే అవునంటున్నాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులు. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న కొవిడ్ చైనా దేశం నుంచి వ్యాప్తి చెందింది. ఈ సారి పిల్లల్లో శ్వాసకోశ సమస్యలతో కొత్త మహమ్మారి ప్రబలుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారులతో చైనా దేశ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. చైనాలో ప్రబలుతున్న ఈ వైరస్ మరో కొవిడ్ ను తలపిస్తుందని చైనా వాసులు చెబుతున్నారు.

పిల్లల వ్యాధులపై సమాచారం ఇవ్వండి : ప్రపంచ ఆరోగ్య సంస్థ

చైనా దేశంలోని పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులైన న్యుమోనియా వ్యాప్తిపై సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా దేశాన్ని అభ్యర్థించింది. చైనాలో శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ చైనా వైద్యుల్ని కోరింది. అక్టోబరు నుంచి ఉత్తర చైనాలో ఇన్‌ఫ్లుఎంజా వంటి అనారోగ్యం వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారిన ప్రవాస భారతీయుల పోరు

చైనాలో కొవిడ్ వ్యాప్తిపై ఆంక్షలను ఎత్తివేయడంతో పిల్లల్లో ఇన్‌ఫ్లుఎంజా వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్నాయని చైనా వైద్యాధికారులు చెప్పారు.న్యుమోనియా లక్షణాలతో బీజింగ్, లియనోనింగ్ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పిల్లలు ఆసుపత్రుల్లో చేరారు. పిల్లల్లో శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి మిస్టరీగా మారిందని వైద్యాధికారులు అంటున్నారు. శిశువులను ప్రభావితం చేసే ఆర్ఎస్‌‌వీ,మైకోప్లాస్మా న్యుమోనియాతో సహా వ్యాధికారక వ్యాప్తిలో ఇటీవలి పోకడలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ALSO READ : Coca-Cola Tea : భారతదేశం మార్కెట్‌లో ఇక కొత్తగా కోకా కోలా టీ…కొత్తగా ప్రారంభం

అంతుపట్టని న్యుమోనియా నివారణకు టీకాలు వేయించుకోవడం, జబ్బుపడిన వారి నుంచి దూరం ఉంచడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం వంటి నివారణ చర్యలు తీసుకోవాలని చైనా వైద్యాధికారులు ప్రజలకు సూచించారు.