కుంభవృష్ణిగా వర్షం పడితే..ఆకాశానికి చిల్లు పడిందా ఏంటి అని అనుకుంటుంటాం.ఉరుములు..మెరుపులు వచ్చినప్పుడు ఆకాశం ఊడి పడిపోతుందేమో అని సాధారణంగా అనుకుంటుంటాం. కానీ నిజంగా ఆకాశానికి చిల్లు పడుతుందా? ఇది సాధ్యమేనా? అంటే నిజమే అంటున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేడ్స్ (యూఏఈ) లో ఈ వింత విపరీతంగా ఆశ్చర్యపరుస్తోంది.
ఆకాశంలో కనిపించిన ఈ ఆకారం ఏర్పడటానికి ముందు ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. తరువాత కొంతసేపటికి ఆకాశంలోని మేఘాలు ఈ రూపంలోకి (హోల్) మారిపోయి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
షార్జాకు చెందిన ఖగోళవేత్త,వాతావరణ శాస్త్రవేత్త ఎబ్రహిం అల్ జర్వాన్ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘‘ఆకాశానికి రంథ్రంలా కనిపిస్తున్న ఆ ఆకారాన్ని ఫాల్‌స్ట్రీక్ హోల్ (వడగట్టు రంధ్రం) అంటారు’’ అని తెలిపారు. దీనిపై అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యుఎస్)స్పందిస్తూ..ఆకాశంలో ఏర్పడే అటువంటి ఆకారాలను ‘హోల్ పంచ్ క్లౌడ్’ అని కూడా అంటారని తెలిపింది. ఇది అరుదైన, అద్భుతమైన క్లౌడ్ ఫార్మేషన్ అంటే మేఘాల అమరిక అని పేర్కొంది.
ఆకాశంలో బాగా ఎత్తులో ఉండే మేఘాలకు వాటికి క్రిందుగా ఉండే మేఘాల్లో నీరు గడ్డకట్టే స్థాయి కంటే చల్లగా ఉండే చిన్న నీటి బిందువులు ఉంటాయని, అవి పూర్తిగా ఏర్పడినప్పుడు మేఘాల మధ్యలో ఈ ఖాళీ ఏర్పడుతుందని ఎన్‌డబ్ల్యూఎస్ పేర్కొంది. ఇదే ఆకాశానికి చిల్లు పడిందనే భావనకు గురిచేస్తోంది. అంతే తప్ప ఆకాశానికి చిల్లు పడటం కాదనేది స్పష్టమైంది. మరి మేఘాల్లో ఏర్పడిన అరుదైన ఆకారమనీ..భవిష్యత్తులో ఇటువంటివి ఎవరన్నా చూస్తే కంగారు పడాల్సిన పనిలేదని..ఇంట్రెస్ట్ ఉన్నవారు ఓ సెల్ఫీ తీసుకుని దాచిపెట్టుకోండి. సెల్ఫీ అంటే ఇష్టమున్నవారు ఇటువంటి అరుదైన..అద్భుతమైన దృశ్యాలను తీసుకోకుండా ఎలా ఉండగలరు..మరి మీరుకూడా చూడండి ఆకాశానికి చిల్లు పడిందని మీరు కూడా నమ్మేస్తారు..
شوهدت هذه الظاهرة النادرة والجميلة صباح اليوم في مدينة العين
تُسمى hole punch cloud
أو ظاهرة fallstreak hole pic.twitter.com/NbOd9zofNk— إبراهيم الجروان (@ibrahimaljarwan) March 17, 2019
Look at this fallstreak hole seen above Buraimi, Oman. Picture from our friends at the Directorate General of Meteorology. pic.twitter.com/l3iIS7EL75
— Steff Gaulter (@WeatherSteff) March 17, 2019