దర్జాగా సెలూన్ కు వెళ్లి.. బిల్లు ఎగొట్టి ఎస్కేప్!

ఇలానే ఓ అమ్మాయి నెయిల్ సెలూన్ కు వెళ్లి గోళ్లకు ఫాలిష్ వేయించుకొని ముచ్చట తీర్చుకుంది. ఇందులో ఏం ఉంది అనుకుంటున్నారా? అసలు కథ ఇక్కడే జరిగింది.

  • Publish Date - January 3, 2019 / 09:01 AM IST

ఇలానే ఓ అమ్మాయి నెయిల్ సెలూన్ కు వెళ్లి గోళ్లకు ఫాలిష్ వేయించుకొని ముచ్చట తీర్చుకుంది. ఇందులో ఏం ఉంది అనుకుంటున్నారా? అసలు కథ ఇక్కడే జరిగింది.

అందమైన గోళ్లు కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ అమ్మాయితే చెప్పన్కర్లేదు. గోళ్లను పొడవుగా పెంచుకోవడం పెయింట్ వేసుకోవడం ఇలా ఎన్నో చేస్తుంటారు. అవసరమైతే ఓ నెయిల్ సెలూన్ కో వెళ్తుంటారు. కొత్త స్టయిల్ తమ గోళ్లకు ఫాలిష్ వేయించుకొని చూచి తెగ ముచ్చట పడుతుంటారు. ఇలానే ఓ అమ్మాయి నెయిల్ సెలూన్ కు వెళ్లి గోళ్లకు ఫాలిష్ వేయించుకొని ముచ్చట తీర్చుకుంది. ఇందులో ఏం ఉంది అనుకుంటున్నారా? అసలు కథ ఇక్కడే జరిగింది. లాస్ వీగాస్ లో క్రిస్టల్ నెయిల్స్ అనే సెలూన్ ఉంది. ఈ సెలూన్ కు నెయిల్ ఫాలిష్ కోసం ఓ యువతి వచ్చింది. సెలూన్ మేనేజర్ మిస్ నెగ్ గుయెన్ (51) ఆ యువతికి సరికొత్త స్టెయిల్ లో నెయిల్ ఫాలిష్ చేసి అందంగా తీర్చిదిద్దారు.

అనంతరం 35 డాలర్ల బిల్లు ఛార్జ్ చేశారు. బిల్లు చూసిన యువతి వెంటనే తన బ్యాగులోని క్రెడిట్ కార్డు తీసి ఇచ్చింది. ఆ కార్డు పనిచేయడం లేదని సెలూన్ యజమాని చెప్పలోపే యువతి అక్కడి నుంచి కారులో పరారైంది. అది గమనించిన సెలూన్ మేనేజర్ ఆమెను వెంబండించింది. యువతి కారును అడ్డుకునేందుకు యత్నించింది. కానీ, యువతి తన కారుతో సెలూన్ ఓనర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన సెలూన్ మేనేజర్ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు లాస్ వీగాస్ పోలీసులు వెల్లడించారు. ఇక్కడ మరో కొసమెరుపు ఏంటంటే.. యువతి పారిపోయిన కారు రెంటల్ ఏజెన్సీ నుంచి మూడు వారాల క్రితం మిస్సింగ్ అయిందట. మృతిచెందిన సెలూన్ యజమానికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు మనమళ్లు ఉన్నారు.