NASA Administrator Bill Nelson
NASA Administrator Bill Nelson: రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ టచ్ లో ఉన్నారని.. 2022 చివరి నుంచి వీరి సంబంధాలు కొనసాగుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించిన విషయం తెలిసిందే. వారి మధ్య వ్యక్తిగత అంశాలతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు పేర్కొంది. ఈ కథనం సంచలనంగా మారింది. అయితే, యుక్రెయిన్ – రష్యా యుద్ధం వేళ స్టార్ లింక్ టర్మినల్స్ ను రష్యాకు మస్క్ విక్రయించాడంటూ విమర్శలు వచ్చాయి. అవన్నీ తప్పుడు ఆరోపణలని మస్క్ తోసిపుచ్చారు. అయితే, రష్యా అధ్యక్షుడితో సంబంధాలు దేశ భద్రతాపరమైన సమస్యలు లేవనెత్తొచ్చునని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మస్క్ కు చెందిన స్పేస్-ఎక్స్ సహా పలు సంస్థలు యూఎస్ మిలటరీ, ప్రభుత్వ ఏజెన్సీలతో విస్తృతమైన వ్యాపార లావాదేవీలు కలిగి ఉండటమే అందుకు కారణం. తాజాగా ఈ విషయంపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ స్పందించారు.
నాసాకి స్పేస్ ఎక్స్ కీలకమైన వాణిజ్య భాగస్వామి. శుక్రవారం నాసాకు చెందిన క్రూ-8 మిషన్ సభ్యులు స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ పై క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. అయితే, వరల్డ్ ఎకానమీ సమ్మిట్ లో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ పాల్గొన్నారు. సమ్మిట్ లో వేదికపై జరిగిన ఒక ఇంటర్వ్యూలో నెల్సన్ ను వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం గురించి ప్రశ్నించారు.. దీనికి ఆయన స్పందిస్తూ.. మస్క్, పుతిన్ మధ్య జరిగిన ఫోన్ కాల్స్ గురించి వాల్ స్ట్రీట్ నివేదిక పరిశోదించబడాలని, ఆ కథ నిజమో కాదో నాకు తెలియదని నెల్సన్ చెప్పాడు. ఎలోన్ మస్క్, పుతిన్ మధ్య అనేసార్లు సంభాషణలు జరిగాయి అనేది నిజమైతే అది ముఖ్యంగా నాసా, రక్షణ శాఖకు, కొన్ని గూఢచార సంస్థలకు సంబంధించినది అని నేను భావిస్తున్నాను అని నెల్సన్ అన్నారు.
Asked about the WSJ report on Elon Musk’s conversations with Putin, @SenBillNelson tells @burgessev:
“[SpaceX] have been phenomenally successful … I don’t know that that story is true. I think it should be investigated. If the story is true … that would be concerning.” pic.twitter.com/5Mlo2AEDNx
— Semafor (@semafor) October 25, 2024