Israel Iran War: ఇరాన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ సైన్యం.. అమెరికా ఏమన్నదంటే?

ఈనెల ప్రారంభం నుంచి ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోందని

Israel Iran War: ఇరాన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ సైన్యం.. అమెరికా ఏమన్నదంటే?

Israel Iran War

Updated On : October 26, 2024 / 7:26 AM IST

Israel Iran War: ఈనెల ప్రారంభంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. శనివారం తెల్లవారు జామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా సమీపంలోని నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు చేసింది. నెలరోజులుగా ఇరాన్ చేస్తున్న నిరంతర దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. అదే సమయంలో టెహ్రాన్ సమీపంలోని అనేక సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడింది.

Also Read: Trump vs Harris : డోనాల్డ్ ట్రంప్ vs కమలా హారిస్.. పోల్ సర్వేలో 2 పాయింట్లతో స్వల్ప ఆధిక్యంలో ట్రంప్!

ఇరాన్ పై వైమానిక దాడుల విషయంపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఇజ్రాయెల్ సైనికాధికారి డేనియల్ హగారి మాట్లాడారు.. ఇరాన్ పై దాడిని ధ్రువీకరించారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్ లోని సైనిక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఇరాన్, దాని ప్రాక్సీలు ఈ నెల ప్రారంభం నుంచి ఇజ్రాయెల్ పై నిరంతరం దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి అవసరమైన ప్రతిదాన్ని మేము చేస్తామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ట్విటర్ ఖాతాలో ఫొటోను షేర్ చేసింది. అందులో చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ హెర్జి హలేవి, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఆఫీసర్ జనరల్ టోమార్ బార్ తో కలిసి క్యాంప్ రాబిన్ (కిర్యా) వద్ద ఉన్న భూగర్భం కమాండ్ సెంటర్ నుండి ఇరాన్ పై దాడికి నాయకత్వం వహిస్తున్నారు.

Also Read: Ratan Tata Will : రతన్ టాటా వీలునామాలో పెంపుడు కుక్క ‘టిటో’కు వాటా.. ఇంకా ఎవరికి ఆస్తి దక్కిందంటే?

ఇరాన్ పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల విషయంపై అమెరికా స్పందించింది. ఈ దాడిని ఆత్మరక్షణ చర్యగా పేర్కొంది. వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి సీన్ సావెట్ మాట్లాడుతూ.. ఈనెల ప్రారంభం నుంచి ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోందని మేము అర్ధం చేసుకున్నాం. వారి ఆపరేషన్ గురించి మరింత సమాచారంకోసం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సూచిస్తాం. అయితే, ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక కార్యకలాపాల్లో అమెరికా ప్రత్యక్ష్యంగా పాల్గొనడం లేదని పేర్కొన్నారు.