Trump vs Harris : డోనాల్డ్ ట్రంప్ vs కమలా హారిస్.. పోల్ సర్వేలో 2 పాయింట్లతో స్వల్ప ఆధిక్యంలో ట్రంప్!
Donald Trump vs Kamala Harris : ట్రంప్‌కు 48 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపితే.. హారిస్‌కు 46 శాతం మంది ఓటర్లు జై కొట్టారు. గత ఆగస్టులో జరిపిన సర్వేలో కూడా ట్రంపే ఆధిక్యాన్ని సాధించారు.

Donald Trump vs Kamala Harris ( Image Source : Google )
Donald Trump vs Kamala Harris : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండు వారాల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది. పలు సర్వేల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాజాగా సీఎన్‌బీసీఆల్-అమెరికా ఎకనామిక్ సర్వే ప్రకారం.. కమలా హారిస్ (46శాతం) కన్నా ట్రంప్ (48శాతం) ఆధిక్యంలో ఉన్నారు. దాంతో హారిస్‌పై ట్రంప్ 2శాతం పాయింట్లతో స్వల్ప ఆధిక్యం సాధించినట్టు సర్వే సంస్థ వెల్లడించింది.
ట్రంప్‌కు 48 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపితే.. హారిస్‌కు 46 శాతం మంది ఓటర్లు జై కొట్టారు. గత ఆగస్టులో జరిపిన సర్వేలో కూడా ట్రంపే ఆధిక్యాన్ని సాధించారు. మరో ఏడు రాష్ట్రాల్లో కూడా కమలపై ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.
అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 19 వరకు నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 186 మంది ఓటర్లు కీలక రాష్ట్రాలైన అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఈ రాష్ట్రాల నుంచి అదనంగా 400 మంది ఓటర్ల నుంచి 586 మంది వరకు ఉన్నారు.
ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ, మధ్యతరగతి అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే ఓటర్లలో ట్రంప్ ఆధిక్యాన్ని సాధించారు. అయితే, హారిస్ మాత్రం ఆర్థిక వ్యవస్థ కన్నా తక్కువ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ ఆందోళన కలిగించే ఇతర సమస్యలపై ముందున్నారు.
ఇద్దరు అభ్యర్థులు అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్ల కోసం పోటీ పడుతున్నారు. ముందస్తు ఓటింగ్ ప్రారంభమైనప్పటికీ.. నవంబర్ 5న ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోల్స్ మారవచ్చు. ఎన్నికల్లో ట్రంప్‌కు 61 శాతం విజయావకాశాలు ఉండగా, హారిస్‌కు 39 శాతం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also : Diwali Muhurat Trading : దీపావళి ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ట్రేడింగ్ సమయంలో మనం స్టాక్స్ కొనవచ్చా?