Diwali Muhurat Trading : దీపావళి ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ట్రేడింగ్ సమయంలో మనం స్టాక్స్ కొనవచ్చా?

Diwali Muhurat Trading : దీపావళి ముహూరత్ ట్రేడింగ్.. ఈ ప్రత్యేకమైన ఒక గంట ట్రేడింగ్ సెషన్ నవంబర్ 1, 2024న సాయంత్రం 6:15 నుంచి 7:15 వరకు జరుగుతుంది

Diwali Muhurat Trading : దీపావళి ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ట్రేడింగ్ సమయంలో మనం స్టాక్స్ కొనవచ్చా?

What is Muhurat Trading ( Image Source : Google )

Updated On : October 25, 2024 / 10:35 PM IST

Diwali Muhurat Trading : మరో వారంలో దీపావళి ముహూరత్ ట్రేడింగ్ 2024 ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేకమైన ఒక గంట ట్రేడింగ్ సెషన్.. నవంబర్ 1, 2024న సాయంత్రం 6:15 నుంచి 7:15 వరకు జరుగుతుంది. సంపద, శ్రేయస్సుతో ముడిపడిన సమయం ఇది. భారతీయ ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అద్భుత అవకాశం. సాంస్కృతికంగా ముఖ్యమైన ఈ ట్రేడింగ్ ఈవెంట్‌ను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మీ పెట్టుబడి వ్యూహాన్ని ఇప్పుడే సిద్ధం చేసుకోండి.

దీపావళి ముహూరత్ ట్రేడింగ్ 2024 :
ముహూరత్ ట్రేడింగ్ అనేది దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించేది. ప్రత్యేకంగా లక్ష్మీ పూజ సందర్భంగా భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నిర్వహించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ సాయంత్రం జరుగుతుంది. కేవలం ఒక గంట పాటు మాత్రమేకొనసాగుతుంది. పెట్టుబడికి అనుకూలమైనదిగా భావించే సమయంలో మార్కెట్‌లో పాల్గొనేందుకు వ్యాపారులు, పెట్టుబడిదారులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.

దీపావళి పండుగ చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయానికి ప్రతీక. ఈ పండుగ కాలంలో ప్రజలు సాంప్రదాయకంగా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌తో సహా వివిధ ఆస్తులలో పెట్టుబడి పెడతారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల సంపద సృష్టించే అవకాశాలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. ప్రతి సంవత్సరం, స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్ కోసం షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి. దీనికోసమే పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కొత్త పెట్టుబడులకు శుభ సమయం :
ముహూరత్ ట్రేడింగ్ సాధారణంగా పెట్టుబడికి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు.మీరు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇదో అద్భుతమైన అవకాశం. ముహూరత్ ట్రేడింగ్ సమయంలో మార్కెట్ బుల్లిష్‌గా ఉంటుంది. మొదటిసారి పెట్టుబడిదారులకు, బ్లూ-చిప్ స్టాక్‌లు, ముఖ్యంగా నిఫ్టీ 50లో ఉన్నవి, ఈ సెషన్‌లో పెట్టుబడికి తరచుగా సిఫార్సు అవుతుంటాయి. అయితే, పెట్టుబడి పెట్టడానికి ముందు ఏదైనా కంపెనీ ప్రాథమిక అంశాలను అధ్యయనం చేయడం అత్యంత అవసరం.

ముహూరత్ ట్రేడింగ్ సమయంలో స్టాక్స్ కొనవచ్చా? :
అవును.. ముహూరత్ ట్రేడింగ్ సెషన్ స్టాక్‌లను కొనడానికి లేదా విక్రయించడానికి అనుకూలమైన సమయం. హై ట్రేడింగ్ వాల్యూమ్‌లు, సాధారణంగా బుల్లిష్ సెంటిమెంట్ పెట్టుబడిదారులకు ఇది ఆకర్షణీయమైన కాలం. మీరు ఈ ఏడాదిలో ముహూరత్ ట్రేడింగ్‌కు సిద్ధమవుతున్నారా? అయితే పూర్తిగా పరిశోధించి, మీ పెట్టుబడి లక్ష్యాలను పరిగణించాలని గుర్తుంచుకోండి. సరైన వ్యూహంతోనే మీరు ఈ ట్రేడింగ్ సెషన్‌లో అద్భుతమైన అవకాశాలను పొందవచ్చు.

Read Also : Diwali Muhurat Trading 2024 : దీపావళి ముహూరత్ ట్రేడింగ్ తేదీ ఎప్పుడు? సమయం, తేదీ వివరాలివే..!