నిద్ర..సుఖ నిద్ర..మత్తు నిద్ర..ఇలా నిద్ర గురించి చెప్పుకుంటే చాలు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇలా ‘నిద్ర’ప్రియులకు నాసా బంప్ ఆఫర్ ఇస్తోంది.
నిద్ర..సుఖ నిద్ర..మత్తు నిద్ర..ఇలా నిద్ర గురించి చెప్పుకుంటే చాలు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇలా ‘నిద్ర’ప్రియులకు నాసా బంప్ ఆఫర్ ఇస్తోంది. ఏంటి పగలు నిద్రపోతే పగటి కల అనుకుంటున్నారా? కానే కాదండీ..
రెండు నెలల పాటు బెడ్ మీద హాయిగా నిద్రపోతే నాసా మీకు రూ.13 లక్షలు చెల్లిస్తానంటోంది.యురోపియన్ స్పేస్ ఏజన్సీ (ECA)తో కలిసి నాసా సంస్థ ఆర్టిఫిషియల్ గ్రావిటీ (కృత్రిమ గురుత్వాకర్షణ)పై అధ్యయనం చేస్తోంది. మనుషులు నిద్రపోతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటుందో తెలుసుకునేందుకు నాసా పరిశోధనలు జరుపుతోంది. అంతరిక్షం వాతావరణంలో వ్యోమగాములకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు నాసా తొలిసారిగా ఈ ప్రయోగం చేయపడుతోంది.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ
దీని కోసం 24 నుంచి 55 ఏళ్ల వయస్సు గల 12 మంది పురుషులు, 12 మంది మహిళలు అవసరమంటోంది నాసా. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటంటే..రెండు నెలలపాటు బెడ్ మీద నిద్రపోతే చాలు. అంతకుమించి ఇంకేమీ చేయక్కర్లేదు. ఇలా నిద్రపోయింనందుకు నాసా వారికి రూ.12.81 లక్షలు చెల్లిస్తుంది.
ఆర్టిఫిషియల్ గ్రావిటీ బెడ్ రెస్ట్ (AGBRESA) అనే ఈ స్టడీని కొలగ్నేలోని జర్మనీ ఏరో స్పేస్ సెంటర్ (డీఎల్ఆర్)లో నిర్వహించనున్నారు. ఈ స్టడీ జరుగుతున్నప్పుడు వాలంటీర్లు ఎవరూ బయటకు వెళ్లకూడదు. కృత్రిమ గురుత్వాకర్షణలో వారి జ్ఞానశక్తి, కండరాల సామర్థ్యం, గుండె పనితీరు వంటి కీలక అంశాలను స్టడీ చేస్తారు. ఇది సక్సెస్ అయితే.వ్యోమగాములు నివసించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో యాంటీ గ్రావిటీ పరికరాలను ఏర్పాటు చేయనుంది. దీని కోసమే నాసా నిద్రపోయేందుకు అంతటి భారీ మొత్తాన్ని ఇస్తామంటోంది.
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం