నాసా ఫొటోలు: తుఫాన్ దెబ్బకు ఒడిశా అంధకారం

200కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి అలజడులు సృష్టించిన ఫణి తుఫాన్ వల్ల ఘోరంగా నష్టవాటిల్లింది. విద్యుత్ సరఫరా స్తంభించడంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. మే3న జరిగిన ఫొని తుఫాన్‌కు ముందు, ఆ త‌ర్వాత ఆ న‌గ‌రాల్లో ఉన్న విద్యుత్ వెలుగుల గురించి నాసా ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేసింది. తుఫాన్ రాక ముందు.. తర్వాత     విద్యుత్ దీపాల‌తో వెలిగిపోతున్న‌ న‌గ‌రాల ఫోటోల‌ు, అంధకారంలో మగ్గిపోతున్న ఫొటోలను రిలీజ్ చేసింది. 

ఈ సందర్భంగా ఏప్రిల్ 30, మే 5వ తేదీన తీసిన ఫోటోలను పోస్టు చేసింది నాసా. సౌమి ఎన్‌పీపీ శాటిలైట్‌లో ఉన్న విజిబుల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీట‌ర్ సూట్ నుంచి ఈ ఫోటోల‌ను తీశారు. తుఫాన్ తీవ్రతకు భారీ నష్టం వాటిల్లింది. బీజూ ప‌ట్నాయ‌క్ అంతర్జాతీయ విమానాశ్ర‌యంలోని ప్యాసింజెర్ ట‌ర్మిన‌ల్‌కు భారీగా దెబ్బతింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా డామేజ్ అయింది. పూరి, భువనేశ్వర్, కటక్, ఖుర్దా నగరాల్లో ప్రాణనష్టం సంభవించగా, మిలియన్ల సంఖ్యలో నివాసాలను కోల్పోయారు. ఒడిశా తీర ప్రాంతంలోని నగరాలు, గ్రామాల్లో 3.5 మిలియన్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. 

మట్టి కొట్టుకుపోవడంతో లక్షా 56వేల కరెంట్ పోల్స్ నేలకొరిగాయి. 400కిలోవాట్ల ఐదు టవర్లు, 220కిలోవాటల్స 27టవర్లు, 130కిలోవాట్ల 21టవర్లు, ఎనిమిది గ్రిడ్‌లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోయి.. టెలీకమ్యూనికేషన్ల వ్యవస్థకు అంతరాయం కలిగేలా చేశాయి.