Rainbow Mars : అంగారకుడిపై అందమైన హరివిల్లు.. నాసా రోవర్ తీసిన ఫొటో

అంగారకుడిపై హరివిల్లులు (ఇంద్రధనస్సు) ఏర్పడాతాయట.. భూమిపై మాదిరిగానే అంగారకుడి వాతావరణంలో కూడా ఇంద్రధనస్సులు ఏర్పడతాయనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.

Nasa Releases Breathtaking Rover Photo Of “rainbow” On Mars

Rainbow on Mars : అంగారకుడిపై హరివిల్లులు (ఇంద్రధనస్సు) ఏర్పడాతాయట.. భూమిపై మాదిరిగానే అంగారకుడి వాతావరణంలో కూడా ఇంద్రధనస్సులు ఏర్పడతాయనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. సాధారణంగా భూ వాతావరణంలో ఇంద్రధనస్సు ఏర్పడాలంటే ఆకాశంలో సూర్యరశ్మి, వర్షపు చినుకులు అవసరం. అప్పుడు మాత్రమే హరివిల్లు ఏర్పడుతుంది. అయితే మార్టియన్ వాతావరణం చాలా పలచగా సన్నగా ఉంటుంది.

అందులోనూ భూమితో పోలిస్తే చాలా పొడిగా ఉంటుంది మార్స్. అంగారకుడిపై వాలిన అద్భుతమైన ఈ హరివిల్లును నాసా Perseverance రోవర్ క్యాప్చర్ చేసింది. రెడ్ ప్లానెట్ వాతావరణంలో రోవర్ హాజర్డ్ అవైడెన్స్ కెమెరాతో ఇంద్రధనస్సును ఫొటో తీసింది. వాస్తవానికి అంగారకుడి వాతావరణంలో వర్షంపడే పరిస్థితులు లేవు. అది రెయిన్ బో కాదని స్పష్టంగా తెలుస్తోంది.

నాసా తీసిన ఫొటోను పరిశీలించిన వాతావరణ సైంటిస్టులు అది.. దుమ్ముతో ఏర్పడిన విల్లు ‘డెస్ట్‌బో’ లేదా నీటి తంతువులకు బదులుగా దుమ్ము గాలిలోకి రిప్లెక్షన్ కావడం ద్వారా ఇలా హరివిల్లులా ఏర్పడి ఉండొచ్చునని అంటున్నారు.