Hospital Used Toilet Water
30 years Japan hospital used toilet water for drinking : జపాన్. టాప్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. టెక్నాలజీలో జపాన్ కున్న ప్రత్యేకతే వేరు. అటువంటి జపాన్ లోని ఒక ఆసుపత్రి సిబ్బంది, రోగులు 30 ఏళ్లుగా టాయిలెట్ నీటినే తాగారట. కానీ ఎవ్వరికి అది టాయ్ లెట్ నీరని తెలియలేదట. అది కావాలని చేసిందా? అంటే అలాంటిదేమీ కాదు. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్లుగా టాయిలెట్ వాటర్ తాగటం పైగా అది టాయిలెట్ వాటర్ అని తెలియకపోవటం విడ్డూరమని చెప్పాలి.జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ ఆసుపత్రిలో జరిగిందిది. గత నెలలో ఈ ఆసుపత్రి పరిసరాల్లోని ఒక ప్రాంతంలో తవ్వుతుండగా కొన్ని పంపు నీటి పైపులు రాంగ్ కనెక్షన్ ఇచ్చినట్లుగా గుర్తించారు. వీటిలో టాయిలెట్ పైపులు కూడా కనెక్ట్ అయినట్లుగా గుర్తించి ఆశ్చర్యపోయారు.
Read more : World Oldest Cake : 80 ఏళ్లనాటి చాక్లెట్ కేకు..ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే..!!
ఈ గజిబిజి గందరగోళం పైపుల్లో తాగునీటి పైపులు టాయిలెట్ కి అనుసంధానం చేసినవి ఉన్నాయట. ఈ ఆసుపత్రి 1993లో ప్రారంభమైనప్పుడు 120 పైపులు నుంచి నాసిరకం నీరు వస్తున్నట్లు అప్పట్లో ఫిర్యాదుల కూడా వచ్చాయి. దాని గురించి ఎవ్వరు పట్టించుకన్నట్లుగా లేదు. కానీ ఇన్నేళ్లకు ఇప్పుడు దానిపై విచారిస్తే ఆ టాయిలెట్ వాటర్‌ని రోగులు, సిబ్బంది 30 ఏళ్లుగా వినియోగించినట్టు తేలింది. దురదృష్టమేమిటంటే ఆసుపత్రికి సంబంధించి భవనాలు నిర్మిచాలనుకునే వరకు ఎవ్వరు వీటిని గుర్తించలేకపోయారు. మూడు దశాబ్దాలుగా వీటిని ఎవ్వరు గుర్తించకపోవటం విశేషం.
Read more : By mistake : బై మిస్టేక్..వేరే వారి బిడ్డకు జన్మనిచ్చింది..! ఆమె బిడ్డ ఏ తల్లి కడుపులో ఉందో..!!
కాకపోతే ఈ మరుగుదొడ్డి నీటిని తాగినా ఎవ్వరికి ఎటువంటి సమస్యలు రాకపోవటం మరో విశేషం అని చెప్పాలి. అధునాతన వైద్య సంరక్షణను అందించే మెడికల్ యూనివర్శిటికి చెందిన ఆసుపత్రిలో ఇలా జరగడం తమను ఆందోళనకు గురిచేసిందని తనని క్షమించండి అంటూ ఆసుపత్రి డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ కజుహికో నకటానీ సిబ్బందిని, రోగులను కోరారు.